Movie News

Ramachandhra Rao PN : జూనియర్ ఎన్టీఆర్ కోసం 4 సంవత్సరాలు ఎదురుచూసా… చివరికి మూడు కోట్ల నష్టం చూసా…!

Ramachandhra Rao PN : ‘సంధ్యారాగం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామచంద్ర రావు పిఎన్ ఆ తరువాత వచ్చిన ‘మెరుపు దాడి’ సినిమాతో డైరెక్టర్ గా అడుగుపెట్టి మంచి విజయం సొంతం చేసుకున్నారు. ఇక తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో మంచి విజయాలను అందుకున్నారు. ఇక తెలుగులో ఉన్నట్టుండి చాలా గ్యాప్ వచ్చింది పిఎన్ఆర్ గారికి. ఇక ఆయన కెరీర్ లో గ్యాప్, సినిమాలు లేకుండా ఉన్నందుకు కారణాలను వివరించారు.

ఎన్టీఆర్ కోసం మూడేళ్లుగా వెయిట్ చేశా…

కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాక ఆర్థికంగా కూడా నష్టం వచ్చి ఇబ్బందులు పడుతున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఏవంటే అవి సినిమాలను చేయొద్దు మనం ఒక మంచి సబ్జెక్టు చేద్దాం అంటూ వెయిట్ చేయమని చెప్పడం తో చాలా కాలం ఎదురుచూశా కానీ ఎన్టీఆర్ ఎదిగి పోతున్నాడు నేను మాత్రం అక్కడే ఉండిపోయా అంటూ పిఎన్ఆర్ చెప్పారు. ఇక ఎదురుచూస్తూ ఉన్న సమయంలో ‘గోల్మాల్’ సినిమా అవకాశం వచ్చింది.

ఇక ఎన్టీఆర్ ను సంప్రదిస్తే మంచి కథ చేయమని చెప్పారు. ఇక జేడీ చక్రవర్తి కన్నడ హీరో రమేష్ అరవింద్ లను హీరోలుగా సినిమా చేయాలనుకున్నాక ఫైనాన్సిర్ గా ఉన్న అతను ఒక్కసారిగా చేతులెత్తేయడం, నిర్మాత కూడా చేయిదాటి పోవడం వల్ల నేనే అన్నీ చేసుకోవాల్సి వచ్చింది. ఇక ఆ సినిమా వరల్డ్ కప్ సమయంలో రిలీజ్ అవ్వడం వల్ల సినిమా బాగున్నా పెద్దగా కలెక్షన్స్ రాలేదు. వచ్చిన దాంట్లో అందరికీ ఇవ్వాల్సిన డబ్బులు సెటిల్ చేసాను. కానీ నాకు మాత్రం మూడు కోట్లు నష్టం వచ్చింది. ఇంకా కోలుకోలేదు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

పాదాల్లో తిమ్మిర్లు వస్తున్నాయా? ఇది విటమిన్ లోపం హెచ్చరిక కావచ్చు!

మన ఆరోగ్యం గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను పట్టించుకుంటే పెద్ద సమస్యలను సులభంగా…

1 day ago

బెండకాయలో దాగిన హెల్త్ పవర్… షుగర్ కంట్రోల్‌కు సూపర్ ఫుడ్!

వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగా సాధారణంగా మన…

1 day ago

ఇంట్లో ఈ మూలలో నీళ్లు పెడితే… డబ్బు ప్రవాహం ఆగదు అంటున్నారు!

ఇంట్లో సుఖసంతోషాలు, ఆర్థిక స్థిరత్వం కోసం చాలా మంది వాస్తు సూచనలను పాటించడం సాధారణంగా కనిపించే విషయం. ముఖ్యంగా నీటికి…

1 day ago

రోజూ పిస్తా తింటున్నారా? ఈ లాభాలు తెలుసుకుంటే ఆశ్చర్యమే!

రోజువారీ ఆహారంలో డ్రైఫ్రూట్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అందులో పిస్తా (పిస్తాచియోస్) ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పదార్థంగా గుర్తింపు…

1 day ago

చేతులు చూస్తేనే తెలిసిపోతుంది… మీ కొలెస్ట్రాల్ స్థాయి!

మన శరీరం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి పెద్దగా పరీక్షలు అవసరం లేకుండా కొన్ని సంకేతాలు మనమే గుర్తించగలుగుతాం. ముఖ్యంగా…

1 day ago

భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు… శ్రీశైలంలో చలివేంద్రాల ఏర్పాటు!

ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశంలోని ప్రముఖ…

1 day ago