Featured

Indira Devi : ఆరోగ్య పరిస్థితి బాగోలేక హాస్పిటల్ లో చేరిన మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి… ఆందోళనలో అభిమానులు..!

Indira Devi : సూపర్ స్టార్ మహేష్ బాబు.. సినిమాలతో ఎంత బిజీ గా ఉంటారో మనకు తెలిసిందే. కానీ కాస్త తీరిక దొరికినా కుటుంబంతో కలసి విదేశాలకు చెక్కేస్తుంటారు. మహేష్ బాబు కుటుంబానికి ఎంత ప్రాముఖ్యం ఇస్తారో చాలా సార్లు ఆయన మాటల్లోనే విన్నాం. అయితే మహేష్ బాబుకు వారి తల్లి తండ్రుల మీద కూడా చాలా ప్రేమ ఉంది. ముఖ్యంగా వారి అమ్మగారు ఇందిరా దేవి అంటే ఎనలేని ప్రేమ. ఏ ఫంక్షన్ అయినా ఇంటర్వ్యూ అయినా వారి గురించి చెబుతూ ఎమోషనల్ అవుతుంటారు. అయితే ఇందిరా దేవి గారి ఆరోగ్యం గురించి పలు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో వెంటిలేటరుపై చికిత్స…

ఇందిరా దేవి గారి ఆరోగ్య పరిస్థితి కాస్త సీరియస్ అవ్వడంతో ఏఐజి హాస్పిటల్ లో చేర్పించినట్టు సమాచారం. ఇందిరా దేవి గారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారట. ప్రస్తుతం ఇందిరా దేవి గారు ఎమర్జెన్సీ వార్డులో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మహేష్ బాబు కూడా హాస్పిటల్ లో తల్లి వద్దనే ఉన్నారు. అయితే వైద్యులు ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నాం అని చెప్పారు.

ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిసేసరికి మహేష్ బాబు తో సహా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇందిరా దేవి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలియగానే సూపర్ స్టార్ అభిమానులు ఆందోళన చెందారు. ఇక కృష్ణ గారు ఇందిరా దేవి గారిని 1961లో పెళ్లి చేసుకున్నారు. తరువాత 1969 లో విజయ నిర్మల ను పెళ్లి చేసుకున్నారు. 2019లో విజయ నిర్మల కన్నుమూశారు. ఇటీవల లాక్ డౌన్ సమయంలో మహేష్ బాబు అన్న రమేష్ బాబు కన్నుమూశారు. ఇపుడు ఇందిరా దేవి ఆరోగ్య పరిస్థితి బాగోలేదన్న విషయం అభిమానులను కలవరపెడుతోంది.

Bhargavi

Recent Posts

నేను నటిని.. సంఖ్యలతో కాదు ప్రతిభతో అవకాశాలు రావాలి: శివాత్మిక ఘాటు వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…

8 hours ago

బ్యాంక్ లోన్ తెలిసింది.. ఐపీఎల్‌లో ప్లేయర్ లోన్ ఏంటి? ఆర్‌సీబీ స్టార్ చెన్నై దారి పట్టాడా!

ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…

8 hours ago

మళ్లీ అతడితో పని చేయను.. ప్రగతి సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…

8 hours ago

హీరోయిన్ అంటే ఆమెనే.. జయసుధ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…

8 hours ago

సినిమాల కంటే కుటుంబమే ముఖ్యం.. నాదియా షాకింగ్ రివీల్

తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…

8 hours ago

మ్యాచ్‌కు ముందు కార్టూన్లు.. మైదానంలో రికార్డులు! సూర్యవంశీ స్టైల్

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…

11 hours ago