Categories: FeaturedMovie News

Chennakesava Reddy : 20 ఏళ్ళ తరువాత కూడా దుమ్మురేపుతున్న బాలయ్య మాస్ సినిమా….. వైరల్ అవుతున్న చెన్నకేశవరెడ్డి సినిమా థియేటర్ వీడియోలు…!

Chennakesava Reddy : నందమూరి బాలకృష్ణ హీరోగా 20 ఏళ్ళ కిందట వచ్చిన చెన్నకేశవరెడ్డి సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. థియేటర్ లలో అది సృష్టించిన రికార్డులకన్నా, ప్రేక్షకుల మీద దాని ప్రభావం ఎక్కువ అనే చెప్పుకోవాలి. మాములుగా బాలయ్య సినిమాలు అంటేనే అభిమానులకు మాస్ జాతర. ఇక మునుపెన్నడు చూడని విధంగా వినాయక్, బాలకృష్ణ ను చూపించాడు. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమాలో బాలయ్య సరసన టబు, శ్రేయ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికి ఈ సినిమాని అభిమానులు మర్చిపోలేక పోతున్నారు. చెన్నకేశవ రెడ్డి సినిమా సృష్టించిన ప్రభంజనం అలాంటిది.

థియేటర్ లలో మరోసారి ప్రభంజనం సృష్టిస్తున్న చెన్నకేశవ రెడ్డి…

2002లో సెప్టెంబర్ 25న విడుదల అయిన ఈ సినిమా, ఇరవై ఏళ్ళ తర్వాత మరోసారి థియేటర్స్ లో చెన్నకేశవ రెడ్డి సినిమాని మాస్ జాతర చేస్తున్నారు అభిమానులు. బాలకృష్ణ అభిమానులు చెన్నకేశవ రెడ్డి సినిమాను మరోసారి రిలీజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా చాలా థియేటర్స్ లో చెన్నకేశవ రెడ్డి స్పెషల్ షోలు పడ్డాయి. రెండవ సారి విడుదల జరిగిన థియేటర్ లలో మాస్ జాతర ఏమాత్రం తగ్గలేదు.

పరుచూరి బ్రదర్స్ ఊర మాస్ డైలాగులు, మణిశర్మ అందించిన పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇప్పటికి అభిమానుల చేత థియేటర్ లో విజిల్స్ వేయిస్తున్నాయి. రెండవసారి విడుదల అయిన చెన్నకేశవ రెడ్డి సినిమాను అభిమానులు థియేటర్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago