Chennakesava Reddy : నందమూరి బాలకృష్ణ హీరోగా 20 ఏళ్ళ కిందట వచ్చిన చెన్నకేశవరెడ్డి సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. థియేటర్ లలో అది సృష్టించిన రికార్డులకన్నా, ప్రేక్షకుల మీద దాని ప్రభావం ఎక్కువ అనే చెప్పుకోవాలి. మాములుగా బాలయ్య సినిమాలు అంటేనే అభిమానులకు మాస్ జాతర. ఇక మునుపెన్నడు చూడని విధంగా వినాయక్, బాలకృష్ణ ను చూపించాడు. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమాలో బాలయ్య సరసన టబు, శ్రేయ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికి ఈ సినిమాని అభిమానులు మర్చిపోలేక పోతున్నారు. చెన్నకేశవ రెడ్డి సినిమా సృష్టించిన ప్రభంజనం అలాంటిది.

థియేటర్ లలో మరోసారి ప్రభంజనం సృష్టిస్తున్న చెన్నకేశవ రెడ్డి…
2002లో సెప్టెంబర్ 25న విడుదల అయిన ఈ సినిమా, ఇరవై ఏళ్ళ తర్వాత మరోసారి థియేటర్స్ లో చెన్నకేశవ రెడ్డి సినిమాని మాస్ జాతర చేస్తున్నారు అభిమానులు. బాలకృష్ణ అభిమానులు చెన్నకేశవ రెడ్డి సినిమాను మరోసారి రిలీజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా చాలా థియేటర్స్ లో చెన్నకేశవ రెడ్డి స్పెషల్ షోలు పడ్డాయి. రెండవ సారి విడుదల జరిగిన థియేటర్ లలో మాస్ జాతర ఏమాత్రం తగ్గలేదు.

20 years back my first movie in theatres, now again watched it in silver screen at Gopi theatre Ongole ????????????????????#NandamuriBalakrishna#Chennakeshavareddy #20YearsOfCKREuphoria pic.twitter.com/cNUu7K17OF
— raghu varma dodla (@RaghuDodla) September 24, 2022
The celebration of Ceded King in his 2nd Kingdom GUNTUR????????????
— Balayya Trends (@NBKTrends) September 24, 2022
రారెవ్వరూ నీకు సాటి…లేరెవ్వరూ నీకు పోటి ???? #Chennakesvareddy celebrations at Plateno cinemas, Guntur.#20YearsOfCKREuphoria pic.twitter.com/Q7gbyCQpFa
పరుచూరి బ్రదర్స్ ఊర మాస్ డైలాగులు, మణిశర్మ అందించిన పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇప్పటికి అభిమానుల చేత థియేటర్ లో విజిల్స్ వేయిస్తున్నాయి. రెండవసారి విడుదల అయిన చెన్నకేశవ రెడ్డి సినిమాను అభిమానులు థియేటర్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




























