Ramayanam : హిందూ మతస్థులు ఆరాధించే దేవుళ్ళలో ఒకరైన రాముడు, ఆయన జీవితమే రామాయణం. వాల్మీకి రచించిన అద్భుతం రామాయణం. కానీ అది వాస్తవంగా జరిగిన కథ అని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఆది కల్పితం అంటూ కొట్టిపడేసే వాళ్ళు ఉన్నారు. అయితే రామాయణం నిజంగా జరిగిందా లేదా అని చరిత్రకారులు పలు పరిశోధనలు జరిపి సాక్ష్యాలను సేకరించారు. మనిషి నడవడిక ఎలా ఉండాలో తెలిపిన రాముడి జీవితం అందరికీ ఆదర్శనీయం అయితే రామాయణం నిజమని నిరూపించే చరిత్ర సాక్ష్యాలు ఏంటో తెలుసుకుందాం.
రాముడు జననం గురించి వాల్మీకి రామాయణ ఏం చెబుతోంది…
చరిత్రకారుల పరిశోధనల ప్రకారం శ్రీరాముడి జననం ఇప్పటి కాలమానం ప్రకారం 5114 బీసీ జనవరి 10న మధ్యాహ్నం 12 నుండి 1 గంట మధ్య జన్మించారని నిర్ధారించారు. ఈ విషయాలను వాల్మీకి రచించిన రామాయణంలో మొదటి అధ్యాయం 18వ ఖండంలో రాసారు. దీనిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదాస్ వారు లెక్కగట్టి ఆది హిందూ క్యాలెండరు ప్రకారం ఆది చైత్ర మాసం లో మనం ప్రస్తుతం జరుపుకుంటున్న శ్రీరామనవమి రోజున అని నిర్ధారించారు.
రామాయణం నిజం అని నిరూపించే మరో రుజువు సీతను అపహారించిన రావణుడు ఆమెను లంకలోని అశోకవనంలో పెట్టాడు. ప్రస్తుతం ఉన్న శ్రీలంక లో ఈ ఉద్యానవనం ఉంది, రామాయణంలో అశోక వనంలో ఉన్న చెట్లు ఇప్పటికీ శ్రీలంక లోని ఉద్యానవనం లో సరిగా అక్కడే ఉన్నాయి. సీతను అపహారించిన రావణుడిని అడ్డుకున్న జటాయువు అనే పక్షి రెక్కలను రావణుడు విరిచేస్తే ఆ పక్షి పడిన నేల ప్రస్తుతం కేరళ లోని కోళ్లం లో ఉంది. అక్కడ భారత దేశంలోని అతిపెద్ధ రాతి నిర్మాణంలో ఉన్న జటాయువు రూపం అక్కడ ఉంది.
ఇక సీతాదేవి అశోక వనంలో ఉన్నపుడు స్నానానికి వాడిన జలపాతం శ్రీలంక లోని నోవారా ఆలయం వద్ద ఉంది. అక్కడ ఉన్న కొండా మీద పెద్ద కాలి గుర్తులు ఆంజనేయుడు లంక కు వచ్చినపుడు వేసినవని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఇక రావణుడికి ఉన్న చాలా పుష్పక విమానాలు కోసం విమానాశ్రయాల వంటి ప్రదేశాలు లంకలో ఉండేవని లంక పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
రామాయణం ఉనికిని తెలిపే మరో ఆధారం రామేశ్వరం వద్ద ఉన్న రామసేతు రాతి బ్రిడ్జి నిర్మాణం ఇప్పటికీ సముద్రంలో ఉంది. ఇక చివరగా రావణుడి రాజభవనంను శ్రీలంకలో కనుగొన్నారు. అందులో లంకలోని అనేక ప్రదేశాలకు రహస్య మార్గాలు ఉన్నట్లు కనుగొన్నారు. ఇక లంక చరిత్రలో రావణుడు రహస్య మార్గాలను ద్వారా ప్రజలకు దర్శనమిచ్చేవాడని పేర్కొన్నారు. ఇది కూడా రామాయణం ఉనికిని నిరూపిస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…