Senior journalist Imandi Ramarao : మెగా-అల్లు కుటుంబాల మధ్య ముందు నుండి మంచి అనుబంధం ఉందనే విషయం అందరికీ తెలుసు. ఇక చిరంజీవి గారు అల్లుడు అల్లు అర్జున్ ని కుడా కొడుకు రామ్ చరణ్ తో సమానంగా ప్రమోట్ చేసారు. సినిమాల్లోకి మెగా హీరోగానే బన్నీ అడుగుపెట్టి హిట్లు కొట్టాడు. అయితే ఈ మధ్య కాలంలో అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నాయని బయటకు వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయం మీద ఇరు కుటుంబాల నుండి ఎవరు క్లారిటీ ఇవ్వకపోయినా ఎవరికి వాళ్ళు గ్యాప్ వచ్చింది అంటూ కథనాలు అల్లేస్తున్నారు.
ఊర్వశివో రాక్షసివో కి గెస్ట్ గా బాలయ్య…
ఇక ఇప్పుడు వీటికి ఊతం ఇస్తూ అల్లు శిరీష్ కొత్త సినిమా ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిధిగా బాలకృష్ణ రాబోతున్నారు. మెగా కుటుంబం నుండి ఏ ఈవెంట్ అయినా అందులో చిరు ఖచ్చితంగా ఉంటారు, అలాంటిది ఇప్పుడు ఆయనను కాదని బాలకృష్ణ ను పిలవడం వెనుక మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య గ్యాప్ వచ్చిందంటూ మాట్లాడుతున్నారు. అయితే ఈ విషయాల మీద సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడారు. అల్లు అరవింద్ మంచి వ్యాపారవేత్త తాను అడుగుపెట్టిన అన్ని రంగాల్లోనూ సక్సెస్ అయ్యారు. ఇక ఇప్పుడు ఆహా ఒరిజినల్స్ కూడా మంచి సక్సెస్ చూసారు. అయితే ఇప్పుడు చిన్న కొడుకు శిరీష్ కెరీర్ మీద ఫోకస్ పెట్టినట్లున్నారు అరవింద్ గారు.
అయితే మెగా బ్రాండ్ ను పక్కన పెట్టి నందమూరి ఫ్యాన్స్ సపోర్ట్ కూడా కలపాలని భావిస్తున్నట్లు ఉన్నారు అందుకే బాలకృష్ణ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా పిలిచారు. ప్రస్తుతం బాలయ్య ట్రెండ్ నడుస్తోంది, ఒక వైపు ఆహా లో అన్ స్టాపబుల్, మరోవైపు ‘అఖండ’ వంటి సూపర్ హిట్, ఇప్పుడు ‘వీరసింహ రెడ్డి’ అంటూ కొత్త సినిమా ఇలా ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య క్రేజ్ సినిమా ప్రమోషన్ కి హెల్ప్ అవుతుందని అరవింద్ అంచనాలు వేసి ఒకవైపు బన్నీ ఫ్యాన్స్ మరోవైపు బాలయ్య ఫ్యాన్స్ ను కలిపి సినిమా సక్సెస్ చేయాలనుకుంటున్నట్లు ఇమంది గారు అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…