Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి గేమ్ చేంజర్ అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. అయితే గత నెల రోజులుగా ఈయన ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారనే విషయం మనకు తెలిసిందే. ఇలా నెల రోజులుగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇవ్వడమే కాకుండా మరో రెండు నెలల పాటు ఈ బ్రేక్ కంటిన్యూ చేయబోతున్నారని సమాచారం.
ఇలా రాంచరణ్ సినిమా షూటింగులకు ఇంత గ్యాప్ ఇవ్వడానికి కారణం లేకపోలేదు దాదాపు పది సంవత్సరాల తర్వాత రాంచరణ్ తండ్రి కాబోతున్నారు ఈ క్రమంలోనే ఈయన సినిమా షూటింగుకు బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది. ఉపాసన ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణీ అనే విషయం మనకు తెలిసిందే. ఈమె జులై మొదటి వారంలో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇలా బిడ్డ పుట్టే సమయంలో తాను షూటింగ్లో ఉండకూడదని రామ్ చరణ్ నిర్ణయం తీసుకున్నారట.
ఈ సమయంలో తన భార్యకు తోడుగా ఉండడం కోసం ఇప్పటికే నెల రోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నటువంటి రామ్ చరణ్ పుట్టబోయే బిడ్డ కోసం మరో రెండు నెలల పాటు షూటింగ్ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. తనకు బిడ్డ పుట్టిన తర్వాత తన విలువైన సమయాన్ని తన భార్య బిడ్డలకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు అందుకే ఆగస్టు వరకు ఎలాంటి షూటింగ్ లలో ఈయన పాల్గొనబోరని అప్పటివరకు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారని తెలుస్తుంది.
దాదాపు పెళ్లి జరిగే 10 సంవత్సరాలకు రాంచరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా మెగా వారసుడి రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే చరణ్ సైతం తన పుట్టబోయే బిడ్డ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని అందుకే ఈయన సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చి తన భార్యకు తోడుగా ఉంటున్నారని తెలుస్తోంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…