Ramesh Babu: మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కూడా ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాలలో సాధించి మంచి గుర్తింపు పొందిన విషయం మనకు తెలిసిందే. అయితే రమేష్ బాబు కొంతకాలానికి ఇండస్ట్రీకి దూరమై పలు వ్యాపారాలలో స్థిరపడ్డారు. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి రమేష్ బాబు గత ఏడాది మొదట్లో అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం మనకు తెలిసిందే.
ఇలా రమేష్ బాబు మరణించిన తర్వాత తన తల్లి ఇందిరాదేవి అలాగే తండ్రి కృష్ణ గారు కూడా మరణించడంతో మహేష్ బాబు తీవ్ర దుఃఖంలోకి వెళ్లిపోయారు. ఇలా వరుస విషాదాలు చోటు చేసుకోవడం ఘట్టమనేని ఫ్యామిలీని కృంగదీసిందని చెప్పాలి. కృష్ణ ఇందిరాదేవి వయసు పై పడటంతో మరణించారు. అయితే రమేష్ బాబు మరణం మాత్రం కుటుంబ సభ్యులను బాగా బాధించింది.
అసలు రమేష్ బాబు మరణించడానికి గల కారణాలను తాజాగా ఆయన బాబాయ్ ఆదిశేషగిరిరావు ఈ సందర్భంగా బయటపెట్టారు. ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు రమేష్ బాబు మరణం గురించి మాట్లాడుతూ… రమేష్ బాబు కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించారని తెలిపారు. ఆయన ఇదివరకు గుండె సంబంధిత సమస్యలతో బాధపడ్డారని ఆదిశేషగిరిరావు తెలిపారు.
ఇలా పలుసార్లు గుండె సమస్యలతో బాధపడినటువంటి రమేష్ బాబుకి వైద్యులు స్టంట్ కూడా వేసి సర్జరీలు నిర్వహించారని, ఈ సమస్యల కారణంగానే రమేష్ బాబు మరణించినట్లు ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు తెలియజేశారు. ఇక రమేష్ బాబుకి కూడా కుమారుడు, కూతురు ఉన్న విషయం మనకు తెలిసిందే. తన కుమారుడు ప్రస్తుతం ఉన్నత చదువులు నిమిత్తం విదేశాలలో ఉంటున్నాడని అయితే తనకు సినిమాలలోకి రావాలని చాలా ఆసక్తిగా ఉన్నారు అంటూ ఈ సందర్భంగా ఈయన తెలియచేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…