Ramya Krishna: అలా పిలిస్తే సెక్సీగా ఫీల్ అవుతా… వైరల్ అవుతున్న రమ్యకృష్ణ బోల్డ్ ఇంటర్వ్యూ!

Ramya Krishna: రమ్యకృష్ణ పరిచయం అవసరం లేని పేరు ఒకప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్ గా తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన రమ్యకృష్ణ ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నటువంటి ఈమెకు సంబంధించిన ఒక ఓల్డ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఏ విషయం అయినా ఎంతో ముక్కు సూటిగా మాట్లాడుతూ తన అభిప్రాయాలను తెలియజేసే రమ్యకృష్ణ గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ వీడియోలో రమ్యకృష్ణ ఏం మాట్లాడారు ఏంటి అనే విషయానికి వస్తే…

గతంలో ఈమె ఇంటర్వ్యూలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఇండస్ట్రీలో ఈమెకు సెక్స్ బాంబ్ అనే పేరు ఉండేది. అయితే ఈ పేరు రావడం పై ఈమె స్పందిస్తూ నన్ను సె*క్స్ బాంబ్‌ అంటున్నారు అంటే అది కేవలం తెర వరకు మాత్రమే పరిమితం. నిజ జీవితంలో ఎందుకు అలా ఉంటాను. ఇక నేను అన్నిటికీ సిద్ధమయ్యే అందుబాటులో ఉంటాను అనుకుంటే అది కేవలం వారి మూర్ఖత్వమే. ఎవరు ఏమనుకున్నా నేనేంటో నాకు తెలుసు నన్ను అలా పిలవడంపై నేను ఏమాత్రం బాధపడనని తెలిపారు..

Ramya Krishna: పెళ్లయిన వాడిని చేసుకోకూడదనుకున్నా….

జనం నన్ను సెక్స్ బాంబ్ అంటుంటే చాలా సెక్సీగా ఫీల్ అవుతాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇక ఈమె అప్పట్లో తన పెళ్లి గురించి కూడా మాట్లాడుతూ తాను అందరిలాగా సినిమా వాడిని పెళ్లి చేసుకోను అని చెప్పను తాను ఎవరినైనా ప్రేమిస్తే అది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళైనా సరే పెళ్లి చేసుకుంటాను కానీ తనకు అప్పటికే పెళ్లి మాత్రం జరిగి ఉండకూడదు ఇలా పెళ్లయిన వాడిని చేసుకొని వారిని పెళ్లాడిన వారికి ద్రోహం చేయడం అన్యాయం అనేది నా ఉద్దేశం అంటూ అప్పట్లో ఈమె తన పెళ్లి గురించి కూడా చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.