టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో ఒకరు రానా దగ్గుబాటి. శేఖర్ కమ్ముల “లిడర్” సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రానా ఆ తరువాత వెనుతిరిగి చూడకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. టాలీవుడ్ మాత్రమే కాదు హిందీతో సహా అన్ని భాషల్లోనూ నటిస్తూ ఇండియన్ స్టార్ అనిపించుకుంటున్నాడు. అంతేకాదు ప్రొడ్యూసర్ గా కూడా తనదైన ముద్ర వేసాడు.. సొంతంగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఉన్నప్పటికి తాను సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు. అయితే దర్శకధీరుడు రాజమోళి “బాహుబలి” చిత్రంలో రానా భల్లాలదేవుడి పాత్రలో అతని నటనతో అందరిని ఆకట్టుకున్నాడు.
తాజగా రానా ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. అయితే ఈ భళ్లాలదేవుడిని ప్రేమలో పడేసిన అమ్మాయి ఎవరు అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ అమ్మాయి పేరు మిహికా బజాజ్. ఆమె ఒక బిజినెస్ విమెన్, వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ చేస్తుంది. అంతేకాదు డ్యూడ్రాప్ అనే స్టూడియోను నడిపిస్తుంది. ముంబై కి చెందిన మిహికా.. రానా దగ్గుబాటి ఎక్కడ పరిచయమైంది? వీరిద్దరూ ఎప్పటినుంచి ప్రేమలో ఉన్నారు అనే విషయాలు ఇంకా తెలియాల్సిఉంది. ఇదివరకే హీరో నిఖిల్ కుడా ఇటువంటి పోస్టు పెట్టి ఎంగేజ్మెంట్ కన్ఫామ్ చేసాడు. తాజగా రానా వంతు మరి ఎంగేజ్మెంట్ ఎప్పుడు, ఎక్కడ ఎలా అనెదీ రానాగాని అయన తండ్రి సురేష్ బాబు కానీ ఎప్పుడు, ఎక్కడ ఎలా ప్రకటిస్తారో వేచిచూడాల్సిందే..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…