Rana: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు రానా ఒకరు.అయితే తాజాగా నటుడు రానా బాలీవుడ్ హీరోయిన్ కు క్షమాపణలు చెబుతూ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా రానా బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ అలాగే నటుడు దుల్కర్ సల్మాన్ కు క్షమాపణలు చెబుతూ ఈయన ట్వీట్ చేశారు.
తాజాగా రానా దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాదులో నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని అలాగే రానా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రానా మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ కావడంతో ఈయన బాలీవుడ్ నటికీ పరోక్షంగా క్షమాపణలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రానా మాట్లాడుతూ తాను యాక్టింగ్ స్కూల్లో చదివే సమయంలో దుల్కర్ తన జూనియర్ అని తెలియజేశారు.తను చాలా మృదుస్వభావి. ఓపిక చాలా ఎక్కువ. ఓ సారి నేను హిందీ సినిమా షూటింగ్‌కు వెళ్లాను. ఆ చిత్ర నిర్మాతలు నాకు చాలా సన్నిహితులు. సెట్ లో దుల్కర్ ఒకవైపు నిల్చుని ఉండగా ఆ సినిమాలో నటిస్తున్నటువంటి ఒక స్టార్ హీరోయిన్ తన భర్తతో ఫోన్లో షాపింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు.
ఆమె ప్రవర్తన అక్కడ ఎవరికీ నచ్చలేదు ఆ సమయంలో దుల్కర్ చాలా ఓపికగా ఉన్నారని రానా తెలిపారు. అయితే ఆ హీరోయిన్ గురించి తాను తర్వాత నిర్మాతలతో మాట్లాడానని ఈయన తెలియజేశారు. అయితే పరోక్షంగా రానా మాట్లాడినటువంటి సంఘటన
‘ది జోయా ఫ్యాక్టర్’ అనే సినిమా సెట్‌లో జరిగిందని నెటిజన్లు నిర్దారణకు వచ్చారు. దీంతో సోనమ్‌కపూర్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇలా రానా చేసిన ఈ వ్యాఖ్యలకు హీరోయిన్ పై ట్రోల్స్ రావడంతో ఈయన దుల్కర్ సల్మాన్ తో పాటు హీరోయిన్ సోనం కపూర్ కి కూడా క్షమాపణలు చెబుతూ చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…