Rani Mukerji: బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు పొందిన వారిలో రాణి ముఖర్జీ కూడా ఒకరు. నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ రాణి ముఖర్జీ తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకుంది. ఎప్పటికప్పుడు మంచి మంచి సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రాణి ముఖర్జీ ప్రస్తుతం ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ అనే రియల్ లైఫ్ డ్రామాలో నటించింది.
మార్చి 17న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్స్ ని ప్రారంభించింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న రాణి ముఖర్జీ ఇటీవల తన భర్త గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఆదిత్య చోప్రాను రాణీ ముఖర్జీ పెళ్లి చేసుకుంది. ఆయనకు సొంత నిర్మాణ సంస్థతో పాటు డిస్ట్రిబ్యూషన్ హౌస్, స్టూడియో కూడా ఉన్నాయి.
ఇదిలా ఉండగా ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాణి ముఖర్జీ తన భర్త గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..” నా భర్త ఎంతో మంది హీరోయిన్లతో కలిసి పనిచేస్తున్నాడు. అలాంటప్పుడు నేను ఇతర నిర్మాతలతో కలిసి ఎందుకు పని చేయకూడదు. నాకు స్క్రిప్ట్ నచ్చితే చాలు ఎవరితోనైనా పని చేస్తాను. అది యష్ రాజ్ ఫిల్మ్స్ అయినా సరే లేక మరేదైనా సరే .
ఇక నా కొత్త సినిమా చూసి నా భర్త ఆదిత్య చోప్రా చాలా ఎమోషనల్ అయ్యారు. సాధారణంగా ఏదైనా సినిమా చూసిన తరువాత ఆయన ఎమోషనల్ అవ్వటం అనేది చాలా తక్కువసార్లు జరుగుతుంది. అలాంటిది ఆ సినిమాలో నా యాక్టింగ్ చూసి ఆయన చాలా మెచ్చుకున్నారు.’ అంటూ తన భర్త గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్ లో లేడి ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన రాణి ముఖర్జీ నటించిన తాజా చిత్రం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…