Rashmika: రష్మిక మందన్న ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే నటిగా ఎంతో మంచి గుర్తింపు పొందింది. ఇలా నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె పాన్ ఇండియా స్థాయిలో కూడా మంచి ఆదరణ రావడంతో బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకొని బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక వరుస వివాదాల ద్వారా కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.
ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం తనకు లైఫ్ ఇచ్చినటువంటి రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా చూశారా అని మీడియా ప్రశ్నించగా సినిమా చూసి అంత టైం నాకు లేదంటూ ఈమె చెప్పిన సమాధానం ఎలాంటి పరిణామాలకు దారి తీసినదో మనకు తెలిసిందే. ఈ వివాదం మర్చిపోకముందే రష్మిక మరోసారి సౌత్ సినీ ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో మిషన్ మజ్ను అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమాలోని ఒక సాంగ్ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం ఈవెంట్ నిర్వహించగా ఈ వేడుకలో రష్మిక సౌత్ సినీ ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రొమాంటిక్ సాంగ్స్ తెరకేక్కించడంలో బాలీవుడ్ ది బెస్ట్. సౌత్ ఇండస్ట్రీలో మాస్ మసాలా కమర్షియల్ హంగులు మాత్రమే ఉంటాయని సౌత్ సినిమాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో తాను మొదటిసారి రొమాంటిక్ సాంగ్ చేశానని పాట కోసం తాను చాలా ఎక్సైట్ గా ఉన్నాను అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి.దీంతో పలువురు రష్మిక వ్యాఖ్యలపై స్పందించి కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి తెలుగు తమిళ భాషలలో మంచి గుర్తింపు పొందావు. దీంతో కన్నడ చిత్ర పరిశ్రమ పై ఆరోపణలు చేశావు. ఇప్పుడు బాలీవుడ్ అవకాశాలు రావడంతో సౌత్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడుతున్నావ్ ఇండియా మొత్తం సౌత్ సినిమాల గురించి మాట్లాడుతుంటే నువ్వు మాత్రం సౌత్ సినిమాలను తక్కువ చేసి మాట్లాడుతున్నావు అంటూ పెద్ద ఎత్తున నేటిజల్లు ట్రోల్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…