Punch Prasad: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా తన పంచ్ డైలాగులతో ప్రేక్షకులను నవ్విస్తున్నటువంటి పంచ్ ప్రసాద్ గురించి అందరికీ సుపరిచితమే.ఈయన జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలోనే తన రెండు కిడ్నీలు పాడవడంతో ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు.
జబర్దస్త్ కమెడియన్స్ జడ్జిల సహాయంతో చికిత్స చేయించుకుంటున్నప్పటికీ ప్రస్తుతం డయాలసిస్ ద్వారా ఆయన కాలం గడుపుతున్నారు. ఇక తనకు అలాంటి సమస్య ఉందని తెలిసినప్పటికీ తన భార్య తన కిడ్నీలను దానం చేస్తానని చెప్పి తనని పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే పంచ్ ప్రసాద్ బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఎప్పటిలాగే కమెడియన్స్ తమ ఆటపాటలతో పంచ్ డైలాగులతో అందరిని నవ్వించారు.అయితే పంచ్ ప్రసాద్ మాత్రం తన ఫ్యామిలీ ఫోటోని చూపించి ఒక్కసారిగా తాను ఎమోషనల్ అవ్వడమే కాకుండా అందరి చేత కంటతడి పెట్టించారు.
ఈ కార్యక్రమంలో పంచ్ ప్రసాద్ తన ఫ్యామిలీ ఫోటోని చూపించి తన ఫ్యామిలీలో నేను నా తల్లి తప్ప ఎవరు బ్రతకలేదని ఇదే మా ఆఖరి ఫ్యామిలీ ఫోటో అంటూ ఎమోషనల్ అయ్యారు.ఇలా పంచ ప్రసాద్ తన ఫ్యామిలీ గురించి చెప్పడంతో అక్కడున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.ఒకవైపు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పంచ్ ప్రసాద్ తన బాధను పక్కనపెట్టి నవ్విస్తున్నప్పటికీ తన జీవితంలో ఇంత విషాదం ఉందా అని ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…