Sreeja konidela: మెగా డాటర్ శ్రీజ తరచూ ఏదో ఒక తన వ్యక్తిగత విషయాల వల్ల వార్తల్లో నిలుస్తున్నారు. మొదటిసారి తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన భర్తతో విడిపోయారు. అనంతరం చిరంజీవి తనకు రెండవ పెళ్లి చేసినప్పటికీ రెండో భర్తతో కూడా ఒక కూతురికి జన్మనిచ్చి తన నుంచి కూడా దూరంగా ఉంటున్నారు.ఇలా శ్రీజ కళ్యాణ్ దేవ్ ఇద్దరు కూడా దూరంగా ఉండడంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
వీరి గురించి వీరి విడాకుల గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ ఈ విషయంపై మెగా డాటర్ లేదా మెగా ఫ్యామిలీ ఏ విధంగానూ స్పందించలేదు కానీ వీరిద్దరూ మాత్రం దూరంగా ఉంటున్నారు. ఇకపోతే శ్రీజ చిన్న కుమార్తె నవిష్క డిసెంబర్ 25న తన పుట్టినరోజును జరుపుకుంది. ఈ పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి కళ్యాణ్ దేవ్ తన గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు.
తనని చూసి చాలా రోజులు అవుతుందని తనని చాలా మిస్ అవుతున్నాను అంటూ ఈయన ఎమోషనల్ పోస్ట్ చేశారు. అయితే నవిష్క మాత్రం ప్రస్తుతం తన తల్లి దగ్గరే ఉంటున్నారని అర్థమవుతుంది.ఇక నవిష్కకి కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతే కాకుండా ఈమెకు కూడా ఒక ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఉందనే విషయం మనకు తెలిసిందే.
ఇలా నవిష్క ఇన్స్టాగ్రామ్ మొత్తం తన పెద్ద కుమార్తె నివృత్తి డీల్ చేస్తున్నారు. అయితే తాజాగా నివృతి నవిష్క పుట్టినరోజు సందర్భంగా తన చెల్లెలు ఫోటోలన్నింటినీ కలిపి ఒక వీడియోగా క్రియేట్ చేసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అయ్యింది. మీరు కూడా నవిష్క లేటెస్ట్ ఫోటోలపై ఓ లుక్ వేసేయండి.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…