Rashmika: రష్మిక మందన్న ప్రస్తుతం పుష్ప 2 సినిమా పనులతో పాటు ఇతర సినిమా పనులలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే నేషనల్ క్రష్ అని పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇకపోతే ఇటీవల చెన్నైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రష్మిక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం మీడియా వారు రష్మికను ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. మీరు పెళ్లి చేసుకుంటే ఇండస్ట్రీకి సంబంధించిన వారిని చేసుకుంటారా లేదా బయట వ్యక్తులను చేసుకుంటారా అనే ప్రశ్న వేశారు.
ఈ ప్రశ్నకు రష్మిక సమాధానం చెబుతూ ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కదా అంటూ సమాధానం చెప్పారు. మరి ఆ వ్యక్తి ఎవరు అంటూ ప్రశ్నించడంతో రష్మిక మాత్రం విజయ్ దేవరకొండ పేరును చెప్పడానికి ఇష్టపడలేదు కానీ ఈమె మాత్రం ఖచ్చితంగా విజయ్ దేవరకొండ గురించి చెప్పారని తెలుస్తుంది. గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ రష్మిక ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలను వీరిద్దరు ఎప్పుడు ఖండించలేదు అలాగని ప్రేమ విషయాన్ని కూడా ప్రకటించలేదు అయితే ఇద్దరూ మాత్రం వెకేషన్ లోకి వెళ్లడం అలాగే విజయ్ దేవరకొండ ఇంట్లోనే పండగలను సెలెబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక రష్మిక విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా ఒకే ఇంట్లోనే కలిసి ఉన్నారని పలు సందర్భాలలో వీరిద్దరు విడివిడిగా షేర్ చేసిన ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది. మొత్తానికి ఇలా తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు అనే విషయాన్ని రష్మిక ఈ విధంగా తెలియజేశారనీ చెప్పాలి.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…