Movie News

Allu Arjun: వాళ్లు లేకపోతే పుష్ప సినిమానే లేదు… అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు!

Allu Arjun: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా వేడుకను ఇటీవల చెన్నైలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. చెన్నై అయితే నాకు చాలా మంచి అనుబంధం ఉందని తెలిపారు. నేను నా కెరియర్ లో ఏది సాధించిన అది ఈ చెన్నైకి అంకితం అని తెలిపారు.

ఇక పుష్ప సినిమా గురించి మాట్లాడుతూ మైత్రి మూవీ మేకర్స్ వారు లేకపోతే పుష్ప సినిమా అనే లేదని తెలిపారు. నాకు సొంత నిర్మాణ సంస్థ ఉన్నప్పటికీ మైత్రి మూవీ మేకర్స్ చేసిన విధంగా పుష్ప సినిమాని ఏ నిర్మాణ సమస్థ చేయలేదని తెలిపారు. ఇలా మైత్రి వారు లేకపోతే పుష్ప సినిమా నే లేదని ఈయన తెలిపారు. అనంతరం దేవి శ్రీ ప్రసాద్ గురించి కూడా ఎంతో గొప్పగా చెప్పారు.

ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పని చేశారని బన్నీ తెలిపారు. ఇక రష్మిక గురించి కూడా మాట్లాడుతూ రష్మిక గత నాలుగు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం నాతో కలిసి ప్రయాణం చేస్తుంది. ఈ సినిమాలో నేను ఇంత అద్భుతంగా నటించాను అంటే రష్మిక ఇచ్చిన కంఫర్ట్ కారణమని తెలియజేశారు.

Allu Arjun: డాన్సింగ్ క్వీన్..

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా స్పెషల్ సాంగ్ కూడా విడుదల చేశారు. ఈ పాట గురించి కూడా బన్నీ మాట్లాడుతూ నేను మొదటిసారి ఒక డాన్స్ చేసే ముందు ప్రాక్టీస్ చేశానని ఇది నా కెరియర్ లోనే ఫస్ట్ టైం అనీ తెలిపారు. ఇలా నేను ముందుగా ప్రాక్టీస్ చేయడానికి కారణం డాన్సింగ్ క్వీన్ శ్రీ లీల అంటూ ఆమె ఎంతో ఎనర్జిటిక్ గా డాన్స్ చేస్తారని అందుకే నేను కూడా ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది అంటూ అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago