Rashmika: సినిమా ఇండస్ట్రీలో కొనసాగి సెలబ్రిటీలు వారి సినిమాల విషయంలో ఎన్నో సెంటిమెంట్లను నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా సినిమా విడుదల తేదీలు అలాగే సినిమా టైటిల్స్ వంటి వాటి విషయంలో ఎన్నో సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు అయితే తాజాగా నేషనల్ రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన పుష్ప 2 సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో మరోసారి రష్మిక సినిమాలకు సంబంధించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇదివరకు రష్మిక సూపర్ హిట్ సినిమాల సెంటిమెంట్ ను పుష్ప సినిమాతో పోలుస్తూ ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. మరి రష్మిక హిట్ సెంటిమెంట్ ఏంటి అనే విషయానికి వస్తే.. రష్మికకు డిసెంబర్ నెల ఒక సెంటిమెంట్ అని తెలుస్తోంది. రష్మిక నటించిన మొట్టమొదటి చిత్రం కిరిక్ పార్టీ సినిమా డిసెంబర్ లోనే విడుదల అయి మంచి సక్సెస్ అందుకుంది. అనంతరం పునీత్ రాజ్ కుమార్ సరసన నటించిన అంజనీపుత్ర – గణేష్ తో చేసిన చమక్ అనే సినిమాలు కూడా డిసెంబర్ లోనే విడుదలయ్యి మంచి సక్సెస్ అయ్యాయి.
ఇది కాకుండా ఆమెకు నేషనల్ వైడ్ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన పుష్ప పార్ట్ వన్ సినిమా కూడా డిసెంబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది సినిమా తర్వాత బాలీవుడ్ చిత్రం యానిమల్ సినిమా కూడా గత ఏడాది డిసెంబర్లో విడుదలయి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ లెక్కన డిసెంబర్లో విడుదల కాబోయే పుష్ప 2 సినిమా కూడా రికార్డులు తిరగరాస్తుందని, ఈ సెంటిమెంట్ తో పోలిస్తే పుష్ప సూపర్ హిట్ కావడం గ్యారెంటీ అని అభిమానులు భావిస్తున్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…