Rashmika: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో నటుడు విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ఒకరు. వీరిద్దరూ రెండు సినిమాలలో నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య ఏదో ఉంది అంటూ తరచు వీరి గురించి వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా పలు సందర్భాలలో ఇద్దరు కలిసి వెకేషన్ కి వెళ్లడం సోషల్ మీడియా వేదికగా ఇద్దరు ఒకే ఫోటోలను షేర్ చేయడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని అయితే వీరి రిలేషన్ మాత్రం బయట పెట్టడం లేదని పెద్ద ఎత్తున వీరి రిలేషన్ గురించి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా రష్మిక విజయ్ దేవరకొండ గురించి చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
రష్మిక విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో మేమిద్దరం కూడా ఒకే విధమైనటువంటి సక్సెస్ అందుకుంటున్నామని తెలిపారు. ఇక ఏదైనా కెరియర్ పరంగా లేదా వ్యక్తిగత విషయంలోనైనా కూడా నేను ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే తప్పనిసరిగా విజయ్ సలహా తీసుకుంటానని తెలిపారు. ఆయన ఏది మంచి ఏది చెడు అనేది ఉన్నది ఉన్నట్టుగా చెబుతాడు.
నాకు చాలా సపోర్ట్ చేస్తారు..
వృత్తిపరమైనటువంటి జీవితంలో మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా అతను నాకు చాలా సపోర్ట్ చేస్తారంటూ రష్మిక విజయ్ దేవరకొండ గురించి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మరోసారి వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అంటూ వీరి డేటింగ్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం వీరిద్దరూ కూడా తమ కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…