devotional

Ratha Saptami 2025: ఈరోజే రథసప్తమి… ఇలా చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి… అంతా శుభమే?

Ratha Saptami 2025: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం సూర్య భగవానుడిని ఎంతో పవిత్రమైనటువంటి దేవుడిగా భావించి పూజలు చేస్తూ ఉంటాము. ప్రతి ఆదివారం సూర్యదేవుడికి ప్రత్యేకమైన దినంగా భావించి సూర్య దేవుడిని పూజిస్తూ ఉంటాము అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు వంటివి కూడా చేస్తూ ఉంటాము. ఇక సూర్య భగవానుడికి అత్యంత పవిత్రమైన రోజును రథ సప్తమిగా జరుపుకుంటాము.

ఇక ఈ ఏడాది రథసప్తమి ఫిబ్రవరి 4వ తేదీ జరుపుకోబోతున్నారు. ఈ క్రమంలోనే రథసప్తమి రోజు ఏం చేయాలి, సూర్య భగవానుడిని ఎలా పూజించాలి? ఏది నైవేద్యంగా సమర్పించాలి అనే విషయానికి వస్తే… సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఇలా ఉత్తరాయణంలో మాఘమాసంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమిగా జరుపుకుంటారు.

ఈరోజు ప్రత్యేకంగా సూర్య భగవానుడికి పూజిస్తారు ఉదయమే నిద్రలేచి నది స్నానం ఆచరించడం ఎంతో మంచిది. ఇలా నది అందుబాటులో లేనివారు ఇంట్లోనే స్నానం చేసే సమయంలో తలపై జిల్లేడు ఆకు రేగుపండును పెట్టుకుని చేయటం ఎంతో మంచిది. ఇలా స్నానం చేసిన అనంతరం సూర్య భగవానుడి రాగి చెంబులో నీటిని వేసుకుని అర్ఘ్యం ఇవ్వాలి. అనంతరం సూర్య భగవానుడి చిత్రపటాన్ని శుభ్రం చేసి ఎర్రని పుష్పాలతో అలంకరించుకోవాలి. ఇక స్వామివారికి ఎంతో ఇష్టమైన పాలు పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఇంటిముందు కూడా ఈరోజు రథం ముగ్గులు వేసుకోవడం మంచిది.

ఇక సూర్యోదయం అయిన తర్వాత తూర్పు దిశగా తులసి కోట పక్కన ఆవుపేడతో శుభ్రంగా అలికి , పొయ్యి వేసి అందులో ఆవు పిడకలతో ఆవు పాలను పొంగించి అందులోనే బియ్యం వేసి స్వామివారికి పాల పొంగలి తయారు చేయాలి అనంతరం ఈ పాలు పొంగలిని ఏడు చిక్కుడు ఆకులలో నైవేద్యంగా దేవుడికి సమర్పించాలి. అయితే ఏడు చిక్కుడుకాయలతో రథం తయారుచేసి తులసి కోట ముందు పెట్టి ఈ చక్కెర పొంగలి నైవేద్యాన్ని కూడా ఆ రథం ముందు ఉంచి పూజ చేయడం వల్ల సూర్య భగవానుడి దీవెనలు మనపై ఉండి జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోయి అన్ని శుభాలే కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

శ్రీరంగంలో అద్భుతాలు: స్వామివారి పాదరక్షల రహస్యం ఏమిటి?

దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన, విస్తీర్ణం పరంగా అగ్రగామిగా నిలిచిన క్షేత్రాల్లో ఒకటి శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం. ‘భూలోక వైకుంఠం’గా…

37 seconds ago

మీ కళ్లు పెద్దవా? అయితే మీ స్వభావం ఇలా ఉంటుందట!

మన రోజువారీ సంభాషణల్లో “పెద్ద కళ్లు”, “చిన్న కళ్లు” అనే మాటలు తరచూ వినిపిస్తుంటాయి. రూపురేఖల పరంగా ఇది ఒక…

13 minutes ago

పుట్టుమచ్చల రహస్యం: ఈ చోట్ల ఉంటే సంపద, సౌఖ్యం మీవే!

పుట్టుమచ్చలు అంటే సాధారణంగా శరీరంపై కనిపించే చిన్న గుర్తులు మాత్రమే అని చాలామంది భావిస్తారు. అయితే భారతీయ సంప్రదాయాల్లో, ముఖ్యంగా…

27 minutes ago

ఎండలో బయటికి వెళ్లగానే తలనొప్పి వస్తుందా? ఇది సాధారణం కాదు… శరీరం ఇస్తున్న హెచ్చరిక!

వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయట అడుగు పెట్టడమే కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో చాలామందిని వేధిస్తున్న…

1 hour ago

పెళ్లి తర్వాత తొలి బర్త్‌డే… కూర్గ్‌లో రష్మిక సెలబ్రేషన్స్

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన 30వ పుట్టినరోజును ఎంతో ప్రత్యేకంగా జరుపుకున్న విధానం అభిమానులను ఆకట్టుకుంటోంది. పెళ్లి తర్వాత…

1 hour ago

నమ్మాలా? వదిలేయాలా? ఈ ప్రాంతాలపై ప్రజల్లో భయం ఎందుకు?

భారతదేశంలో ఆధ్యాత్మిక విశ్వాసాలు, సంప్రదాయాలు ఎన్నో రూపాల్లో కనిపిస్తాయి. దేవాలయాలు, పుణ్యక్షేత్రాలతో పాటు కొన్ని ప్రదేశాలు రహస్య ఆచారాలు, తాంత్రిక…

2 hours ago