బిగ్ బాస్ కార్యక్రమం 12 వారాలు పూర్తి చేసుకుని కేవలం మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది.ఇక 12వ వారంలో భాగంగా నామినేషన్ లో ఉన్నటువంటి వారిలో కాజల్ ఎలిమినేట్ అవుతుందని అందరూ భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ఉంటారని భావించిన యాంకర్ రవి ఎలిమినేట్ కావడంతో ఫ్యాన్స్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోయారు.
ఇదిలా ఉండగా నామినేషన్ లో కాజల్, రవి ఉండగా సన్నీ తన ఎవిక్షన్ పాస్ ఉపయోగించుకోవచ్చని చెప్పడంతో సన్నీ కాజల్ కోసం తన ఎవిక్షన్ పాస్ ఉపయోగించాడు.అయితే ఎవరూ ఊహించని విధంగా కాజల్ సేఫ్ జోన్ లో ఉండి రవి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఇలా రవి ఎలిమినేట్ కావడంతో హౌస్ లో ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఎంతో ఎమోషనల్ అయ్యారు.
ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున బిగ్ బాస్ నిర్వాహకులపై మండిపడ్డారు. బయట ఎంతో పాపులారిటీ ఉన్నటువంటి రవి విషయంలో కూడా ఎంతో చాకచక్యంగా ఆడుతున్నారు. టాప్ 3 లో ఉన్నటువంటి రవికి ఏ విధంగా ఓట్లు తక్కువ పడ్డాయి రవి ఎలిమినేషన్ వెనుక ఏదో కుట్ర ఉందంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేశారు.
ఇదిలా ఉండగా రవి ఎలిమినేషన్ విషయంలో ప్రస్తుతం పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయని రవి ఎలిమినేషన్ జీర్ణించుకోలేని అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్ద రవి ఫ్యాన్స్,తెలంగాణ జాగృతి కార్యకర్తలు బిగ్ బాస్ కి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. బిగ్ బాస్ ఓటింగ్ లో కుట్ర జరిగిందని అందుకే రవి ఎలిమినేట్ అయ్యాడని, అందుకే బిగ్ బాస్ కంటెస్టెంట్ ల కు వస్తున్న ఓట్లను బహిర్గతం చేయాలని వీరు డిమాండ్ చేశారు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…