Categories: FeaturedGeneral News

Ravi, Sai Priya : మొదటి భర్తకు సింపుల్ గా సారీ అంటూ చెప్పిన సాయి ప్రియ… ఆమెను వెతకడానికి అయిన ఖర్చు ఎవరిస్తారంటూ ప్రశ్నలు…!

Ravi, Sai Priya : వివాహ బంధం నేడు ఎంత అపహాస్యం అవుతుందో ఇలాంటి ఘటనలు చూసినపుడు అనిపిస్తుంది. విశాఖపట్నం లో సంచలనం రేపిన సాయి ప్రియ మిస్సింగ్ కేసు తుది దశకు చేరుకుంది. ప్రేమించినవాడితో లేచి పోయిన సాయి ప్రియ చివరకు ఆచూకీ లభించింది. తన భార్య ఏమైందో అని వెతికి ఆందోళన చెందిన భర్తను బాగానే మోసం చేసింది సాయి ప్రియ. ఇలాంటి ఘటనలు సమాజలో మారుతున్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.

పెళ్లిరోజే ప్రియుడితో పారిపోయిన సాయి ప్రియ…

శ్రీనివాస్ అనే వ్యక్తికి సాయి ప్రియ తో పెద్దలు కుదుర్చిన పెళ్లి జరిగి రెండేళ్లు గడవడంతో వాళ్ల పెళ్లి రోజును జరుపుకోడానికి సోమవారం సాయంత్రం విశాఖపట్నం బీచ్ కి వెళ్లారు. ఇక అక్కడ భార్యకు గిఫ్ట్ గా రెండు బంగారు గాజులను కూడా ఆమెకు ఇచ్చాడు శ్రీనివాస్. కాళ్ళు కడుక్కుంటూ ఉండగా సాయి ప్రియ కనిపించకుండా పోయింది. అప్పటి వరకూ సంతోషంగా భార్య తో ఉన్న శ్రీనివాస్ కు ఆందోళన మొదలయింది. ఎంత వెతికినా ఆమె కనిపించలేదు. ఇక పోలీసులు రంగప్రవేశం చేసారు. ఆమె కోసం గాలిస్తున్న సమయంలో బుధవారం సాయి ప్రియ నుండి తండ్రికి ఫోన్ లో మెసేజ్ వచ్చింది. నేను క్షేమంగా ఉన్నాను, నాకోసం వెతకోద్దు. అలా చేస్తే నేను నా లవర్ పవన్ తో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఇక అప్పటికే సాయి ప్రియ మిస్ అవ్వలేదని ప్రియుడితో లేచిపోయిందని అర్థమైన కుటుంబ సభ్యులు, భర్త షాక్ అయ్యారు. ఇక పోలీసులు, కోస్ట్ గార్డ్ సిబ్బంది ఆమె కోసం గాలించి చివరకు పవన్, సాయి ప్రియ ను పట్టుకుని మీడియా ముందు ప్రవేశ పెట్టారు.

గాలింపు కోసం కోటి రూపాయల ఖర్చు…

ఇక సాయి ప్రియ ను వెతకడానికి పోలీసులకు కోస్టల్ గార్డ్ సిబ్బందికి కలిపి అయిన ఖర్చు అక్షరాలా కోటి రూపాయలు. ఇంతటి ప్రభుత్వ ధనాన్ని వృధా చేసి, ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెట్టి వెళ్లి పోయిన సాయి ప్రియ బాధ్యతా రహిత్యాన్ని మీడియా ప్రశ్నించగా తనకు పవన్ అంటే ఇష్టమని పెళ్లి ఇష్టం లేకుండా తల్లిదండ్రులు చేసారని చెప్పింది. ఇలా రెండేళ్ల తరువాత భర్త నుండి లేచిపోయి ప్రియుడి దగ్గరకు వెళ్లడం తప్పు అని అనిపించలేదా అంటే ఇక సోమ్మసిల్లీ పడిపోయింది సాయి ప్రియ.

ఇక ప్రియుడు పవన్ మాట్లాడుతూ మమల్ని వదిలేయండి నాకు ఉద్యోగం ఉంది సాయి ప్రియ ను చక్కగా చూసుకుంటానని చెప్తున్నాడు. పెళ్ళైన ఒక అమ్మాయిని ఇలా తీసుకెళ్లడం తప్పుగా అనిపించలేదా అంటే మేము ఇద్దరం చిన్నప్పటి నుండి ప్రేమించుకున్నాం అంటూ చెపుతున్నాడు. ఇక ఇప్పుడు మిగిలిన ప్రశ్న ఆ కోటి రూపాయలు ఇప్పుడు ఎవరు కడుతారు. భాద్యతా రాహిత్యంగా ప్రవర్తించిన సాయి ప్రియ ఆమె ప్రియుడు పవన్, లేక భార్య ఏమైందో ఆందోళనలో పోలీసులను ఆశ్రయించిన శ్రీనివాసా… ఏది ఏమైనా ఇలాంటి ఘటనల వల్ల వివాహ వ్యవస్తా మీద నమ్మకం సన్నగిల్లుతుంది.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago