Raviteja : మాస్ మహారాజ్ గా పేరు తెచ్చుకున్న రవితేజ కు ఆ పేరు అంత ఈజీగా ఏమీ రాలేదు. కష్టపడి చిన్న చిన్న వేషాలు సినిమాల్లో వేస్తూ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ హీరోగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నేడు ఈ స్థాయికి ఎదిగాడు. సినిమాల్లో అవకాశం రావడం ఒకెత్తయితే దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. రవితేజ హీరోగా ఎన్నో హిట్స్ అలాగే ఫ్లాప్స్ రెండిటినీ చూసినా ఆయనకున్న స్టార్ డమ్, ఫ్యాన్ బేస్ ను మాత్రం పోగొట్టుకోలేదు. ఏ ఇంటర్వ్యూలో అయినా నాకు మెసేజ్ ఇవ్వడంరాదు, చెప్పను ఎవడికి వాడు తెలుసుకోవాలి అంటూ చెప్పే రవితేజ తన జీవితంలో తన గురించి ఒకరు మాట్లాడినపుడు ఎమోషనల్ అయిన విషయాన్ని మాత్రం పంచుకున్నారు.
దాసరి గారు మాట్లాడిన మాటలకు ఏడుపొచ్చింది…
రవితేజ కష్టపడి పైకి రావడమే కాకుండా తనకంటూ సెపరేట్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అయితే తనకు ఎవరికీ సందేశాలు ఏమీ ఇవను, ఎవడికి వాడు తెలుసుకోవాలని చెప్పే రవితేజ తన గురించి ఎవరైనా గొప్పగా చెప్పినా అప్పటికి విని ఆనందిస్తాను కానీ కొంతమంది చెప్పిన విషయాలు మాత్రం బాగా ఎమోషనల్ గా అనిపిస్థాయి అంటూ ‘డాన్ శీను’ సినిమా వేడుకలో దాసరి గారు మాట్లాడిన మాటలు మాత్రం బాగా అనిపించాయి అని చెప్పారు.
దాసరి గారు ఏం మాట్లాడారో ఇప్పుడు గుర్తు లేకపోయినా అది నాకు చాలా ఎమోషనల్ గా అనిపించింది అలానే మనసుకు ఆనందన్నిచ్చింది అంటూ చెప్పారు. తనకు పాత పాటలంటే ఇష్టమని చెప్పే రవితేజ ఎపుడూ ఇళయరాజా, కిషోర్ కుమార్ వంటి వారి సాంగ్స్ వింటూ ఉంటానంటూ చెప్పారు. జిమ్ చేస్తున్నా మెలోడీ సాంగ్స్ వింటూ చేస్తానని చెప్పారు మాస్ మహారాజా.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…