Featured

Rajanikanth : అరవై ఏళ్ళ వయసులో ఇరవై ఏళ్ళ అమ్మాయితో డాన్స్ చేయాలంటే… దేవుడు ఆర్టిస్టులకు ఇచ్చే నరకం : రజనీకాంత్

Rajanikanth : కర్ణాటక బస్ కండక్టర్ గా జీవితం మొదలు పెట్టి నేడు తమిళ ప్రజలకు సూపర్ స్టార్ అయిన వ్యక్తి రజనీకాంత్. ఒక మామూలు వ్యక్తి తలచుకుంటే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు అని రజనీకాంత్ నిరూపించారు. ఎన్నో సూపర్ హిట్స్ ఆయన ఖాతాలో వేసుకుని సౌత్ లో అగ్ర హీరోల్లో ఒకరిగా ఉంటూ ఏడు పదుల వయసులోనూ హిట్లు కొడుతూ కొత్త వారికి పోటీగా ఉన్నారు. స్టార్ డమ్ ఉన్నా కూడా రజనీకాంత్ గారు చాలా సింపుల్ గా ఉండటం ఆయన ప్రత్యేకత. ఇక ఆయన తనతో నటించిన కుర్ర హీరోయిన్ల గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

60 ఏళ్ళ వయసులో కుర్ర హీరోయిన్ తో చేయాలంటే…

ప్రస్తుతం ఉన్న అగ్ర హీరోలందరూ ఆరు పదుల వయసు దాటినా కుర్ర హీరోలతో సినిమాలను తీస్తున్నారు. దీనికి ఏ పెద్ద హీరోనూ మినహాయింపు కాదు. ఇక రజనీకాంత్ గారు కూడా శ్రీయ, అనుష్క, ఐశ్వర్య, సోనాక్షి, నయన తార ఇలా చాలా చిన్న వయసున్న హీరోయిన్లతో నటించారు. అయితే ఒకసారి ఈ విషయం గురించి మాట్లాడుతూ తాను మొదటి సారి కెమెరా ఫేస్ చేసినపుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు కానీ నా కూతురు వయసున్న అమ్మాయితో డ్యూయెట్ చేయమన్నపుడు టెన్షన్ పడ్డాను, చెమటలుపట్టాయి అంటూ చెప్పారు.

ఇక బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి గురించి మాట్లాడుతూ తన కూతుర్లు ఐశ్వర్య, సౌందర్య వాళ్ళతో కలిసి సోనాక్షి ఆడుకునేదని, తాను చిన్న పిల్లగా ఉన్నప్పటి నుండి తెలుసని, అలాంటి అమ్మాయితో డ్యూయట్ పాడమంటే చాలా కష్టంగా ఉంటుందంటూ చాలా ఓపెన్ గా చెప్పేసారు తలైవా. ఏ రోజూ షూటింగ్ లో భయపడలేదని ఈ విషయంలో మాత్రం ఇబ్బందిగా ఉంటుందని చెప్పారు. ఆర్టిస్ట్ కి ఏదైనా కష్టం ఇస్తే దేవుడు అది ఇదే అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

2 days ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

2 days ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

2 days ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

2 days ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

4 days ago