యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయాలు ఎందుకు.. ప్రతీ ఇంటి మనిషిగా మారిపోయింది ఈమె. సుమ అక్కగా అందరికీ పరిచయమే. 6 నుంచి 60 వరకు కూడా అంతా అక్క అంటూ ఆప్యాయంగా పిలుస్తుంటారు. చందమామ అందరికీ మామ అయినట్లు సుమ కూడా అందరికీ అక్క అయిపోయింది. ఎందుకంటే ఆమె చేసే షోలు కూడా అలాగే ఉంటాయి. ప్రతీ ఇంట్లోనూ కలిసిపోయేలా సుమకు ఇమేజ్ వచ్చేసింది. ఎన్నో ఏళ్లుగా బుల్లితెరపై సంచలనాలు సృష్టిస్తున్న సుమ కనకాల పిన్ని కూడా బుల్లితెర ఆర్టిస్ట్ అనే సంగతి చాలా మందికి తెలియదు. సో.. టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా పాపులరైన సుమ పిన్నికి సంబంధించిన వివరాలు మీకోసం..
“చక్రవాకం” సీరియల్ ఒకప్పుడు బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందన్న సంగతి తెలిసిందే.! అశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ఆ సీరియల్ లో ఇందు ఆనంద్ తన నటనతో ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసింది. బుల్లితెర అన్నపూర్ణమ్మగా ఆకట్టుకున్న ఇందు ఆనంద్ అమ్మగా, అమ్మమ్మగా ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో టివి రంగాన్ని ఓ ఊపు ఊపేసింది. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సీరియల్ నటిగా ఇందు ఆనంద్ తన నటనతో తక్కువ కాలంలోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది. కేరళకు చెందిన ఇందు ఆనంద్ పెళ్ళి చేసుకుని హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న టైంలో బుల్లితెరపై నటించే అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. హిందీలో “సహస్ర పంత్” సీరియల్ ద్వారా బుల్లితెరపై ప్రత్యక్షమైంది ఇందు ఆనంద్. ఆ తర్వాత ఎన్నో హిందీ సీరియల్స్ లో నటించింది.
అలాగే టాలీవుడ్ లో “బొంబాయి ప్రియుడు” చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. “బద్రి” చిత్రంలో పవన్ కళ్యాణ్ అత్తగారిగా నటించి టాలీవుడ్ లో కూడా సపోర్టింగ్ యాక్టర్ గా గుర్తింపును సంపాదించుకుంది ఇందు ఆనంద్. ఆ తర్వాత ఎన్నో తెలుగు సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్ గా నటిస్తూ.. మరో ప్రక్క బుల్లితెరపై “శ్రావణ సమీరాలు” సీరియల్ లో అన్నపూర్ణమ్మ పాత్రతో ఇందు ఆనంద్ అందరికీ దగ్గరయ్యారు. “కల్యాణ వైభోగమే”, “కోయిలమ్మ” సీరియల్స్ తో బామ్మగా కూడా నటించింది. 20ఏళ్ళ వయస్సులోనే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నఇందు ఆనంద్ ఎంబీఏ చదివి, ఫ్యాషన్ డిజైన్ కోర్సులు చేసింది.ఈమె భర్త పెద్ద ప్రభుత్వ ఉద్యోగి. వీరికి ఒక కూతురు ఉంది. సినీ రంగంలోకి వచ్చిన కొద్దీ రోజుల్లోనే ఈమె డబ్బింగ్ ఈమె చెప్పుకోవడం ప్రారంభించింది.
అయితే కేరళ అనగానే మనకు స్టార్ యాంకర్ సుమ గుర్తొస్తుంది. సుమ అమ్మమ్మ, ఇందు ఆనంద్ అమ్మ స్వయాన అక్కాచెల్లెళ్లు. ఆ విధంగా సుమకు ఇందు ఆనంద్ పిన్ని వరుస అవుతారు. సో.. వీళ్ళిద్దరూ బుల్లితెరను బాగానే ఏలేస్తున్నారన్నమాట.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…