నిన్ను వదల బొమ్మాలి వదలా… అని విలన్ సోనూసూద్ చెప్పడంతో.. అప్పుడు నువ్వు నన్ను ఏమి చేయలేవురా… అని ఒక గంభీరమైన వాయిస్ వినిపిస్తుంది. అలా తెరపై అనుష్క కనిపించినప్పటికీ ఆ గంభీరమైన వాయిస్ నిజంగా అనుష్కది కాదు. దానికి ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శిల్ప గారు చెప్పడం జరిగింది. 1980 చివరి దశకంలో దూరదర్శన్ లో హిందీ డబ్బింగ్ రామాయణం, మహాభారతం సీరియల్స్ తెలుగులో ప్రసారం అయ్యేవి. నిజంగా ఆ సీరియల్స్ ఆంధ్రదేశమంతటా ఒక ఊపు ఊపేశాయి.
హిందువుల ఆరాధ్య దేవతలైన రాముడు, సీత తో కూడిన రామాయణం సీరియల్ అత్యంత ప్రజాదరణ పొందింది. పంచపాండవుల తో కూడిన మహాభారతం సీరియల్ కూడా అంతే విధంగా ప్రజాదరణ పొందింది. అలా ఆ సీరియల్ చూస్తున్నా ఒక అమ్మాయి తన తల్లి చెప్పే కథలకు ఇన్స్పైర్ కావడం జరిగింది. కానీ ఎప్పుడూ దూరదర్శన్ లో సీరియల్స్ చూస్తున్నప్పుడు తను కూడా అందులో నటిస్తాననని అనుకోలేదు. అలా దూరదర్శన్ లో ఒక సీరియల్ ప్రారంభానికి ఆడిషన్స్ కి కెమెరామెన్ ప్రభు కొత్త నటులకు అవకాశం ఇవ్వగా.. తండ్రికి ఇష్టం లేకపోయినా శిల్ప హాజరు కావడం జరిగింది. అలా ఆడిషన్స్ లో ఎంపిక కావడంతో టీవీ రంగంలో శిల్ప ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఆమే మొదటగా అనగనగా ఒక శోభ అనే సీరియల్ లలో నటించారు. ఆ తర్వాత ప్రదీప్ నిర్మాణ సారథ్యంలో నాలుగు స్తంభాలాట సినిమాలో హీరోయిన్ నటించిన పూర్ణిమ, శిల్ప కలిసి బుచ్చిబాబు అనే మరో టీవీ సీరియల్లో నటించారు. ఇలా ఆమే13 ఎపిసోడ్స్ 26 ఎపిసోడ్స్ లలో నటిస్తూండేవారు.
ఇప్పుడు అనేక ఛానల్లో డైలీ సీరియల్స్ వస్తున్నాయి. కానీ ఒకప్పుడు దూరదర్శన్లో వీక్లీ సీరియల్స్ వచ్చేవి. ఆ సీరియల్స్ కేవలం15, 20 మరియు 30 భాగాలుగా దూరదర్శన్ లో ప్రసారమయ్యేవి. ఇలా టీవీ సీరియల్స్ లలో చేస్తున్నా శిల్ప కి సినిమాల్లో అవకాశం వచ్చింది. ఉషాకిరణ్ మూవీస్ మేనేజింగ్ డైరెక్టర్ అట్లూరి రామారావు తీస్తున్న అమ్మ అనే చిత్రంలో ఓ కొత్త హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పడానికి శిల్పను సంప్రదించడం జరిగింది. తాను సీరియల్స్ లో నటిస్తున్నప్పుడు డబ్బింగ్ చెప్పడం ఏమిటని అనుకుంది. కానీ తెరపై నూతన నటీనటులకు వాయిస్ బాగుండకపోయినా, వారి హావ భావాలు బాగోలేకపోయినా డబ్బింగ్ అనేది ఆ పాత్రకి ప్రాణం పోస్తుందని చెప్పడంతో చివరికి శిల్ప డబ్బింగ్ చెప్పడానికి ఒప్పుకుంది. అలా ఉషాకిరణ్ మూవీస్ లో శరత్ బాబు సుహాసిని నటించిన అమ్మ చిత్రంలో ఓ కొత్త నటికి శిల్ప డబ్బింగ్ చెప్పారు.
ఆ తరువాత ఉషా కిరణ్ మూవీస్ లో మరో చిత్రమైన పీపుల్స్ ఎన్కౌంటర్ చిత్రంలో నటి సంధ్య కి డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత మనవరాలి పెళ్లి చిత్రంతో మొదటగా తెలుగులో తెరంగేట్రం చేసిన సౌందర్యకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించి.. ఆమె చనిపోయేంతవరకు అనేక సినిమాలకి శిల్ప డబ్బింగ్ చెప్పారు. అలా ఆమె ఇంద్రజ, మీనా, రాశి, అనుష్క ఇలా అనేక మంది హీరోయిన్లకు దాదాపు 1000 కి పైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఆమే డబ్బింగ్ చెబుతున్న క్రమంలోనే హీరో మహర్షి రాఘవను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వారి కొడుకు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. శిల్పకు బుల్లితెర నటిగా, బుల్లితెర, వెండితెర డబ్బింగ్ ఆర్టిస్ట్ గా దాదాపు 10నంది అవార్డులు వచ్చాయి.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…