Featured

అలనాటి నటుడు జగ్గయ్య మనవడు కూడా వెండితెరపై నటిస్తున్నాడని మీకు తెలుసా.?!

కంచు కంఠంతో స్పష్టమైన ఉచ్చరణతో సంభాషణలు పలికించే కొంగర జగ్గయ్య ఆనాటి ఎన్టీఆర్, ఏఎన్నార్ సమకాలీన నటుడిగా చెప్పుకోవచ్చు. అందుకే కొంగర జగ్గయ్య ను కళావాచస్పతి అన్నారు.1928 డిసెంబర్ 31న గుంటూరు జిల్లా తెనాలి దగ్గర మోరంపూడి గ్రామంలో జన్మించారు. ఉన్నత చదువులు పూర్తయిన తర్వాత విలేకరిగా కొన్ని రోజులు పని చేయడం జరిగింది. ఆ తర్వాత ఆంధ్ర రిపబ్లిక్ పత్రికకు ఎడిటర్ గా పనిచేశారు. ఆ తర్వాత ఆకాశవాణి రేడియోలో న్యూస్ రీడర్ గా కొన్ని రోజుల పాటు పనిచేస్తుండగా..

త్రిపురనేని గోపీచంద్ పరిచయం ఏర్పడి, 1952లో ఆయన దర్శకత్వంలో తీసిన ప్రియురాలు అనే చిత్రంలో మొదటగా జగ్గయ్య నటించారు. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో రేడియో న్యూస్ రీడర్ గా స్వస్తి పలికి దాదాపు మూడు సినిమాలకి సైన్ చేయడం జరిగింది. అలా బి.యన్.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన బంగారు పాప చిత్రంలో నటించారు. ఇక్కడి నుంచి ఆయన సినీ ప్రయాణం ఎటువంటి అవరోధాలు లేకుండా ముందుకు సాగింది. వి.బి.రాజేంద్రప్రసాద్ నిర్మాణ సారధ్యంలో వచ్చిన అనేక సినిమాల్లో కొంగర జగ్గయ్య నటించారు. సెకండ్ హీరోగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంతారావు లతో చేసినప్పటికీ ఆ తర్వాత వారి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. తమిళంలో శివాజీ గణేషన్ సినిమాలు తెలుగులోకి డబ్ అయినప్పుడు ఆయనకి జగ్గయ్య డబ్బింగ్ చెప్పడం జరిగింది. అలా జగ్గయ్య కంచు కంఠంతో చెప్పిన సంభాషణల సినిమాలు చూసి రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు కళావాచస్పతి అనే బిరుదు ఇవ్వడం జరిగింది. ఆనాటి నటులతోనే కాకుండా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలతో కూడా నటించడం జరిగింది.

చివరిగా మోహన్ బాబు హీరోగా నటించిన డిటెక్టివ్ నారద లో నటించి 2004లో కొంగర జగ్గయ్య తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో ఆయన వారసులు తెలుగు సినీ పరిశ్రమలో లేరు అనుకునే సమయంలో ఆయన సోదరుడు మనవడైన చేస్తూ సాత్విక్ కృష్ణ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టడం జరిగింది. శ్రీనివాస్, సుధారాణిల కు చేస్తూ సాత్విక్ కృష్ణ జన్మించాడు. తండ్రి శ్రీనివాస్ రాజకీయనాయకుడు అయినప్పటికీ తల్లి సుధారాణి స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. 2012 లో బీటెక్ పూర్తి చేసిన చేస్తూ సాత్విక్ కృష్ణ.. చిన్నప్పట్నుంచి నాటికలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్న చేస్తూ సాత్విక్ కృష్ణ ఎంతో ఇష్టాన్ని కనబరిచేవారు. తర్వాత అర్ధనారి అనే సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చేస్తూ సాత్విక్ కృష్ణ కనిపించారు. ఆ తర్వాత ట మంజులానాయుడు దర్శకత్వంలో శ్రావణ సమీరాలు సీరియల్ లో నటించారు. అలాగే అభిషేకం, కోయిలమ్మ, స్వాతి చినుకులు లాంటి సీరియల్స్ లో నెగెటివ్ రోల్స్ చేస్తూ సాత్విక్ కృష్ణ రోజు బుల్లితెరపై కనిపిస్తున్నాడు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago