కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఎన్నో కొత్త పథకాలను అమలు చేస్తోంది. కరోనా వల్ల దేశంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొత్త స్కీమ్ లను అందుబాటులోకి తెస్తోంది. రోజుకు కేవలం 2 రూపాయలు చెల్లించి నెలకు 3,000 రూపాయలు పొందే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోంది. ముఖ్యంగా వ్యాపారులను దృష్టిలో ఉంచుకుని ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.
ప్రధాన్ మంత్రి స్మాల్ బిజినెస్ మాన్ ధన్ యోజన పేరుతో దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ ఉండేది. అయితే కేంద్రం కొన్ని కారణాల ఈ స్కీమ్ పేరును ఎన్‌పీఎస్ ట్రేడర్స్‌గా మార్చింది. స్వయం ఉపాధి పొందుతున్న వ్యాపారులు, షాప్ కీపర్లు, రిటైల్ ట్రేడర్లు ఈ స్కీమ్ ద్వారా 3,000 రూపాయలు పొందవచ్చు. కేంద్రం వ్యాపారులు ఇది వాలంటరీ స్కీమ్ అని ఆసక్తి ఉన్నవాళ్లు ఈ స్కీమ్ లో చేరవచ్చు.
కోటిన్నర రూపాయల లోపు వార్షిక టర్నోవర్ ఉన్నవాళ్లు మాత్రమే ఈ స్కీమ్ లో చేరవచ్చు. ఈ స్కీమ్ లో చేరిన రోజు నుంచి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు వాళ్లు ఈ స్కీమ్ లో చేరితే 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ ను పొందవచ్చు. 18 ఏళ్ల వయస్సులో ఈ స్కీమ్ లో చేరితే నెలకు 55 రూపాయల చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
వయస్సు పెరిగే కొద్దీ చెల్లించాల్సిన మొత్తం కూడా పెరుగుతుంది. . 40 ఏళ్ల వయసులో చేరిన వాళ్లు నెలకు 200 రూపాయల చొప్పున జమ చేయాల్సి ఉంటుంది. కేంద్రం అందిస్తున్న ఈ స్కీమ్ ద్వారా చాలామంది ఇప్పటికే ప్రయోజనం పొందుతున్నారు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…
సినిమా రంగంలో అవకాశాలు పొందడం మాత్రమే కాదు, వాటిని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమైన విషయం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే…
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ, ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఓటు హక్కు…
మైక్రో ఫైనాన్స్ పేరిట వెలుగులోకి వచ్చిన ఆర్థిక మోసం కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పలువురిపై…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సినిమాల విజయాల వెనుక ఆసక్తికర కథలు దాగి ఉంటాయి. అలాంటి సంఘటనల్లో ఒకటి హలో…
తెలుగు గాన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గీతా మాధురి తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా…