కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఎన్నో కొత్త పథకాలను అమలు చేస్తోంది. కరోనా వల్ల దేశంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొత్త స్కీమ్ లను అందుబాటులోకి తెస్తోంది. రోజుకు కేవలం 2 రూపాయలు చెల్లించి నెలకు 3,000 రూపాయలు పొందే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోంది. ముఖ్యంగా వ్యాపారులను దృష్టిలో ఉంచుకుని ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.

ప్రధాన్ మంత్రి స్మాల్ బిజినెస్ మాన్ ధన్ యోజన పేరుతో దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ ఉండేది. అయితే కేంద్రం కొన్ని కారణాల ఈ స్కీమ్ పేరును ఎన్‌పీఎస్ ట్రేడర్స్‌గా మార్చింది. స్వయం ఉపాధి పొందుతున్న వ్యాపారులు, షాప్ కీపర్లు, రిటైల్ ట్రేడర్లు ఈ స్కీమ్ ద్వారా 3,000 రూపాయలు పొందవచ్చు. కేంద్రం వ్యాపారులు ఇది వాలంటరీ స్కీమ్ అని ఆసక్తి ఉన్నవాళ్లు ఈ స్కీమ్ లో చేరవచ్చు.

కోటిన్నర రూపాయల లోపు వార్షిక టర్నోవర్ ఉన్నవాళ్లు మాత్రమే ఈ స్కీమ్ లో చేరవచ్చు. ఈ స్కీమ్ లో చేరిన రోజు నుంచి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు వాళ్లు ఈ స్కీమ్ లో చేరితే 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ ను పొందవచ్చు. 18 ఏళ్ల వయస్సులో ఈ స్కీమ్ లో చేరితే నెలకు 55 రూపాయల చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

వయస్సు పెరిగే కొద్దీ చెల్లించాల్సిన మొత్తం కూడా పెరుగుతుంది. . 40 ఏళ్ల వయసులో చేరిన వాళ్లు నెలకు 200 రూపాయల చొప్పున జమ చేయాల్సి ఉంటుంది. కేంద్రం అందిస్తున్న ఈ స్కీమ్ ద్వారా చాలామంది ఇప్పటికే ప్రయోజనం పొందుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here