మనం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే మాట తరచూ వింటూ ఉంటాం. మద్యం తాగడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం కూడా చూసే ఉంటాం. మద్యం చాలా కుటుంబాల్లో గొడవలకు సైతం కారణమవుతోంది. అయితే మద్యం వల్ల ఏ విధంగా చూసినా మనకు నష్టాలే తప్ప లాభాలు ఉన్నాయని అనిపించడం లేదు. అయితే నిపుణులు మాత్రం మద్యపానం వల్ల నష్టాలతో పాటు లాభాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
మద్యం మోతాదులో తీసుకుంటే లాభాలు ఉంటాయని ఎక్కువ మొత్తంలో మద్యం తీసుకుంటే మాత్రమే ప్రమాదమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అల్జీమర్స్, డెమెన్షియా లాంటి వ్యాధులను దూరం చేయడంలో మద్యం సహాయపడుతుందని తెలుపుతున్నారు. మద్యం తాగని వారితో పోలిస్తే మద్యం తాగేవాళ్లు ఈ వ్యాధుల బారిన పడే అవకాశాలు తక్కువని తెలుపుతున్నారు. డైమెన్షియా బారిన పడితే మనిషి కొద్దికొద్దిగా మేధస్సును కోల్పోతాడు.
మతిమరుపు, బ్రెయిన్ ఫంక్షనింగ్ తగ్గిపోవడం డెమెన్షియా లక్షణాలు. మెదడులోని కణాలు దెబ్బ తినడం వల్ల కలిగే వ్యాధిని అల్జీమర్స్ అంటారు. మనిషి మానసిక స్థితిలో మార్పులకు అల్జీమర్స్ కారణమవుతుందని తెలుపుతున్నారు. కొందరిలో డెమెన్షియా, అల్జీమర్స్ జన్యుపరమైన కారణాల వల్ల వస్తాయని.. మరి కొందరు 60 ఏళ్లు పై బడిన తరువాత అల్జీమర్స్ బారిన పడతారని తెలుపుతున్నారు.
ఒక అధ్యయనం ద్వారా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. దీంతో మద్యం తాగడం వల్ల ఆరోగ్యానికి నష్టాలే కాదని లాభాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే పరిమితంగా తాగితే మాత్రమే ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అపరిమితంగా మద్యం తాగడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…