Renu Desai: రేణు దేశాయ్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత తన కుమారుడు అకీరా తన తండ్రి వెంటే కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఫోటోలను కూడా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు..
అయితే ఈమె గురించి పవన్ కళ్యాణ్ అభిమానులు తనతో పోల్చి కొన్ని వార్తలను వైరల్ చేస్తుంటారు. అలాంటి తరుణంలో రేణు దేశాయ్ ఘాటుగా స్పందిస్తూ తప్పుడు వార్తలను ఖండిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ పై రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక యూట్యూబ్ ఛానల్ వీడియోలో ఏముందో తెలియదు కానీ థంబ్ నెయిల్ మాత్రం అకీరాకు ఖరీదైన కానుక ఇచ్చిన మెగాస్టార్ షాక్ లో రేణు దేశాయ్ అంటూ ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఒక అభిమాని ఈ వీడియోని రేణు దేశాయ్ కి ట్యాగ్ చేస్తూ ఇది నిజమేనా అంటూ ప్రశ్నించారు.
ఇది అబద్ధం..
ఇక ఈ వీడియో ఫై రేణు దేశాయ్ స్పందిస్తూ ఇది పూర్తిగా అబద్ధం యూట్యూబ్ ఛానల్ లో వచ్చే వార్తలను ఎవరు నమ్మకండి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు దయచేసి సినిమా స్క్రిప్టులను రాయండి కానీ ఇలా ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దు అంటూ తనదైన స్టైల్ లో వార్నింగ్ ఇస్తూ అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ని కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…