రేణూ దేశాయ్ గత కొద్దిరోజులుగా కరోనా రోగులకు చేతనైన సాయం తన మంచి మనసును చాటుకుంటున్నారు నటి రేణు దేశాయ్.. అయితే ఇందులో కూడా కొందరు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఆమె తమకు మెసెజ్‌లకు రిప్లై ఇవ్వకపోవడం, అడిగిన సాయం చేయకపోవడంతో కొంతమంది ఆమెపై నెగిటివ్ కామెంట్స్ చేయడం, తిట్టడం మొదలుపెట్టారు.. ఇదివరకే ఆటువంటి కామెంట్స్ పై రేణూ దేశాయ్ స్పందించారు. ఒక్కోసారి నేను మీరు పంపిన మెసెజ్‌లు చూడలేకపోవచ్చు.. అయినా నేను సాయం చేయలేకపోతే నన్ను అడిగే హక్కు మీకు లేదు.. నేనేమీ మీరు ఓట్లు వేసి గెలిచిన నాయకురాలిని కాదంటూ కాస్త ఘాటుగా స్పందించారు.
ఇక తాజాగా మరోసారి రేణూదేశాయ్ తనకు ఆర్ధిక సాయం చేయమని డిమాండ్ చేస్తున్న వారిపై స్పందించారు.. తమకు ఆర్థిక సాయం చేయమంటూ చాలా మెసెజ్‌లు వస్తున్నాయని, అయితే తాను అసలు ఎవరికీ ఆర్థిక సాయం చేయలేనని, కానీ ఫుడ్, నిత్యావసరాలు, మెడిసిన్స్ వంటి సాయం చేయగలనని చెప్పుకొచ్చారు. అంతేగానీ ఆర్థిక సాయం చేయమని డిమాండ్ చేస్తూ.. ఒకవేళ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ మెసెజ్‌లు చేస్తున్నారని. అటువంటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రేణూ దేశాయ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…
చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…
ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్‌ను వదిలి…
తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…
సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…