అటువంటి మెసేజ్ లు చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా ! రేణు దేశాయ్ ఆగ్రహం..!

0
171

రేణూ దేశాయ్ గత కొద్దిరోజులుగా కరోనా రోగులకు చేతనైన సాయం తన మంచి మనసును చాటుకుంటున్నారు నటి రేణు దేశాయ్.. అయితే ఇందులో కూడా కొందరు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఆమె తమకు మెసెజ్‌లకు రిప్లై ఇవ్వకపోవడం, అడిగిన సాయం చేయకపోవడంతో కొంతమంది ఆమెపై నెగిటివ్ కామెంట్స్ చేయడం, తిట్టడం మొదలుపెట్టారు.. ఇదివరకే ఆటువంటి కామెంట్స్ పై రేణూ దేశాయ్ స్పందించారు. ఒక్కోసారి నేను మీరు పంపిన మెసెజ్‌లు చూడలేకపోవచ్చు.. అయినా నేను సాయం చేయలేకపోతే నన్ను అడిగే హక్కు మీకు లేదు.. నేనేమీ మీరు ఓట్లు వేసి గెలిచిన నాయకురాలిని కాదంటూ కాస్త ఘాటుగా స్పందించారు.

ఇక తాజాగా మరోసారి రేణూదేశాయ్ తనకు ఆర్ధిక సాయం చేయమని డిమాండ్ చేస్తున్న వారిపై స్పందించారు.. తమకు ఆర్థిక సాయం చేయమంటూ చాలా మెసెజ్‌లు వస్తున్నాయని, అయితే తాను అసలు ఎవరికీ ఆర్థిక సాయం చేయలేనని, కానీ ఫుడ్, నిత్యావసరాలు, మెడిసిన్స్ వంటి సాయం చేయగలనని చెప్పుకొచ్చారు. అంతేగానీ ఆర్థిక సాయం చేయమని డిమాండ్ చేస్తూ.. ఒకవేళ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ మెసెజ్‌లు చేస్తున్నారని. అటువంటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రేణూ దేశాయ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here