Renudesai: రెండో పెళ్లి గురించి ఓపెన్ అయిన రేణు దేశాయ్.. ఏంచెప్పారో తెలుసా?
Renudesai: ప్రముఖ టాలీవుడ్ నటుడు,జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కు విడాకులు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.వీరిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ తన పిల్లలను తీసుకొని తన తల్లి వద్ద నివసిస్తున్నారు.అయితే పిల్లలతో ఒంటరిగా గడుపుతున్న రేణు దేశాయ్ పిల్లల భవిష్యత్తు కోసం తాను రెండవ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
రేణు దేశాయ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేయగానే పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈమె రెండో పెళ్లి చేసుకోవడం కోసం నిశ్చితార్థం కూడా జరుపుకున్నట్లు ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అయితే ఇప్పటి వరకు అతను ఎవరు ఏంటి అనే విషయాలు తెలియలేదు.
అయితే గత ఏడాది రేణుదేశాయ్ ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అతను అమెరికాలో ఐటి ఉద్యోగం చేసే వారని, అయితే ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇండియా తిరిగి వచ్చి పూణేలో ఉద్యోగం చేస్తున్నారంటూ తనకు కాబోయే రెండో భర్త గురించి రేణుదేశాయ్ తెలియజేశారు. అదేవిధంగా రేణుదేశాయ్ ని చేసుకోబోయే అతను ఒక వాయిస్ ఓవర్ ఇస్తూ రేణుదేశాయ్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇలా తన రెండవ పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ రేణుదేశాయ్ మాత్రం ప్రస్తుతం తనని పెళ్లి చేసుకున్నారా లేదా అనే విషయం గురించి క్లారిటీ లేదు. కాకపోతే గత కొన్ని రోజుల క్రితం అకీరా గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ లో భాగంగా అకీరా తండ్రి స్థానంలో పవన్ కళ్యాణ్ హాజరు కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.ఇక పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ తో పాటు అకీరా, ఆధ్య నలుగురు ఒకే ఫ్రేమ్లో ఉండటం చూసిన పవన్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…