మోడలింగ్ రంగంలో నుంచి తెలుగు చిత్రసీమకు పరిచయమైన రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్‌తో నటించిన తొలి సినిమాతోనే సక్సెస్ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ‘బద్రీ’ చిత్రంలో పవన్ తో కలిసిన నటించిన రేణూ తొలి పరిచయంతోనే మన పవర్ స్టార్ తో ప్రేమలో పడింది. పెళ్ళి చేసుకుంది. పెళ్ళైన తర్వాత కొన్నేళ్ళ పాటు సజావుగానే సాగిన వీళ్ల కాపురంలో కొన్ని కలతలు వచ్చి విడాకులు తీసుకున్నారు.
పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండగా, రేణుదేశాయ్ సినిమాల వైపు అడుగులు వేస్తూ కొన్ని సినిమాలకు దర్శకురాలిగా, నిర్మాతగా తనదైన స్టైల్ లో ముందడుగులేస్తుంది రేణూ దేశాయ్. ఇదిలావుండగా ఈమధ్యకాలంలో సుశాంత్ సూసైడ్ వివాదం బాలీవుడ్, టాలీవుడ్ అనే భేధం లేకుండా మొత్తం సినీరంగాలనే కుదిపేసిన సంగతి తెలిసిందే.! ఇదే అంశంపై మీడియా ముందుకొచ్చిన రేణూ దేశాయ్ నెపోటిజంపై మాట్లాడింది. ఒక్క సినిమా రంగమనే కాదు అన్నీ చోట్ల నెపోటిజం ఉంది. ప్రతిభ ఉండి ధైర్యంగా నిలబడగలిగితే నెపోటిజంను దాటి విజయాలను సాధించవచ్చునని చెబుతూ..
‘సుశాంత్ చాలా సెన్సిటివ్. అతడిలో అద్భుతమైన టాలెంట్ వుంది కాబట్టి సినిమా రంగంలో సక్సెస్ అయ్యాడు. స్టార్ అయ్యాడు. కానీ తనని తాను జాగ్రత్తగా కాపాడుకోవాలి. సుశాంత్ ఎమోషన్స్‌ను బ్యాలెన్స్ చేసుకోవడంలో విఫలమయ్యాడనుకొంటున్నాను. అందువల్లే అతను డిప్రెషన్ కు గురయ్యాడు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ నో, లేక స్వయంప్రతిభనో నమ్ముకుని సినిమా రంగంలోకి రావచ్చు.. కానీ వీటన్నిటికన్నా ముందు ఏ సమస్యనైనా సునాయాసంగా ఎదుర్కోగల మనోధైర్యం కూడా మనలో ఉండాలి. మనల్ని మనం ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలంటే చాలా మానసిక ధైర్యం కావాలి’ అంటూ సుశాంత్ మరణంపై తన ఎమోషనల్ ఫీలింగ్స్ ను పంచుకుంది రేణూ దేశాయ్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…