పట్టపగలే నడిరోడ్డుపై ఓవ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. రోడ్డుపై ఎక్కువ రద్దీ లేకున్నప్పటికీ,ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ రోడ్డుపై ఓ వ్యక్తి తన మిత్రుడితో కలిసి మాట్లాడుతుండగా వెనుక నుంచి మరొక యువకుడు కత్తితో దాడి చేయడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యారు. ఈ విధంగా వ్యక్తి దాడిచేసిన ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు అవడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పుణెలోని పింప్రీ-చింద్వాడ రోడ్డు. చిఖాలీ ఏరియా. ప్రశాంతంగా ఉంది. ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై సరదాగా మాట్లాడుకుంటున్నారు. వీరితో పాటు ఓ కుర్రాడు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే రోడ్డుపై అటుగా వెళ్తున్న ఆకాష్.. అనే కుర్రాడు 4 అడుగుల ముందుకు వెళ్లి అక్కడ ఆగి తన సంచీలోంచి ఒక కత్తిని తీసి కనిఫ్ నాథ్ క్షీరసాగర్ పై దాడి చేశారు.
ఈ విధంగా సాగర్ పై దాడి జరగడంతో అక్కడ ఉన్నటువంటి యువకుడు, కుర్రాడు పరుగులు తీశారు. అదేవిధంగా సాగర్ కూడా పరుగులు తీయడంతో అశోక్ అతనిని వెంబడించినట్లు వీడియోలో రికార్డయింది. ఈ సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా పోలీసులు ఆకాష్ ను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…
క్షీరసాగర్, ఆకాష్… పక్కపక్క ఇళ్లలో ఉంటున్నారు. ఓ రోజు కొంతమంది యువకులు అందరూ కలిసి ఆకాష్ ను చితకబాదడంతో అతను అక్కడి నుంచి ఇళ్లను ఖాళీ చేసే సాగర్ పై పెంచుకొని ఈ విధంగా దాడికి ప్రయత్నించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పథకం ప్రకారమే ఆదివారం మధ్యాహ్నం సాగర్ పై దాడికి ప్రయత్నించాడని, ఆ దాడిలో కింద పడిన సాగర్ ను బండరాయితో కొట్టి ఆకాష్ చంపినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…