సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా వినిపించే పేర్లలో కత్తి మహేష్ పేరు ఒకటి. ప్రముఖ ఫిలిం క్రిటిక్, నటుడిగా రాజకీయ విమర్శకుడిగా నిత్యం ఏదో ఒక వార్తల ద్వారా సోషల్ మీడియాలో ఉండే కత్తి మహేష్ మరణం తర్వాత కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. కత్తి మహేష్ జూన్ 26న నెల్లూరు దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అతడిని మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలోకి తరలించారు.
కత్తి మహేష్ వైద్యానికి సహకరిస్తున్నారని, అతడు ఆరోగ్యంగా ఉన్నాడని తొందరలోనే డిశ్చార్జ్ చేస్తున్నారని హెల్త్ బులిటెన్ విడుదల చేయడంతో కత్తి మహేష్ అభిమానులు సంబర పడ్డారు.ఈ క్రమంలోనే ఉన్నఫలంగా అతని ఆరోగ్యం క్షీణించిందని చెప్పిన కొన్ని క్షణాలకే కత్తి మహేష్ మరణించారని జూలై 10న వైద్యులు ప్రకటించారు. దీంతో కత్తి మహేష్ మరణం వెనుక ఏదో మిస్టరీ ఉందని అతని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
కత్తి మహేష్ కోలుకున్నాడని చెప్పిన వైద్యులు అతనికి ఆక్సిజన్, వెంటిలేటర్ తొలగించడంతో ఆయన అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కత్తి మహేష్ మేనమామ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆక్సిజన్ తొలగించిన తర్వాత ఏం జరిగిందో వివరించాలని అభిమానులు కోరుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఈయనకు అన్ని సర్జరీలు సక్సెస్ అయ్యాయి.కొద్ది రోజులలో డిశ్చార్జ్ చేస్తామన్న వైద్యులు అతను మరణించారని ధ్రువీకరించడంతో మహేష్ చావు వెనక ఏదో రహస్యం దాగి ఉందని పలువురు అనుమానం వ్యక్తం చేయగా అతడు అనారోగ్యం కారణంగానే మృతిచెందాడని మరి కొందరు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం మహేష్ అంత్యక్రియలకు హాజరైన మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ మహేష్ వెనుక పలు అనుమానాలు ఉన్నాయని… దీనిపై వైద్యులు వివరణ ఇవ్వాలని తెలిపారు. ఏది ఏమైనా కత్తి మహేష్ చనిపోయిన తర్వాత కూడా ఈ విధంగా హెడ్ లైన్స్‌లో ఉంటున్నాడు. కత్తి మహేష్ రావు వెనుక మిస్టరీ ఉందా లేదా అనే విషయం తెలియాలంటే వైద్యులు అసలు విషయం బయట పెట్టాల్సి ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…