కత్తి మహేష్ మరణం వెనుక ఇంత కథ ఉందా… మహేష్ చనిపోయాడా లేక చంపేశారా?

0
285

సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా వినిపించే పేర్లలో కత్తి మహేష్ పేరు ఒకటి. ప్రముఖ ఫిలిం క్రిటిక్, నటుడిగా రాజకీయ విమర్శకుడిగా నిత్యం ఏదో ఒక వార్తల ద్వారా సోషల్ మీడియాలో ఉండే కత్తి మహేష్ మరణం తర్వాత కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. కత్తి మహేష్ జూన్ 26న నెల్లూరు దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అతడిని మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలోకి తరలించారు.

కత్తి మహేష్ వైద్యానికి సహకరిస్తున్నారని, అతడు ఆరోగ్యంగా ఉన్నాడని తొందరలోనే డిశ్చార్జ్ చేస్తున్నారని హెల్త్ బులిటెన్ విడుదల చేయడంతో కత్తి మహేష్ అభిమానులు సంబర పడ్డారు.ఈ క్రమంలోనే ఉన్నఫలంగా అతని ఆరోగ్యం క్షీణించిందని చెప్పిన కొన్ని క్షణాలకే కత్తి మహేష్ మరణించారని జూలై 10న వైద్యులు ప్రకటించారు. దీంతో కత్తి మహేష్ మరణం వెనుక ఏదో మిస్టరీ ఉందని అతని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

కత్తి మహేష్ కోలుకున్నాడని చెప్పిన వైద్యులు అతనికి ఆక్సిజన్, వెంటిలేటర్ తొలగించడంతో ఆయన అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కత్తి మహేష్ మేనమామ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆక్సిజన్ తొలగించిన తర్వాత ఏం జరిగిందో వివరించాలని అభిమానులు కోరుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఈయనకు అన్ని సర్జరీలు సక్సెస్ అయ్యాయి.కొద్ది రోజులలో డిశ్చార్జ్ చేస్తామన్న వైద్యులు అతను మరణించారని ధ్రువీకరించడంతో మహేష్ చావు వెనక ఏదో రహస్యం దాగి ఉందని పలువురు అనుమానం వ్యక్తం చేయగా అతడు అనారోగ్యం కారణంగానే మృతిచెందాడని మరి కొందరు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం మహేష్ అంత్యక్రియలకు హాజరైన మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ మహేష్ వెనుక పలు అనుమానాలు ఉన్నాయని… దీనిపై వైద్యులు వివరణ ఇవ్వాలని తెలిపారు. ఏది ఏమైనా కత్తి మహేష్ చనిపోయిన తర్వాత కూడా ఈ విధంగా హెడ్ లైన్స్‌లో ఉంటున్నాడు. కత్తి మహేష్ రావు వెనుక మిస్టరీ ఉందా లేదా అనే విషయం తెలియాలంటే వైద్యులు అసలు విషయం బయట పెట్టాల్సి ఉంటుంది.