RGV : జయప్రద అందాలను చూడ్డానికి నేను అడవిరాముడు సినిమా చూసాను… నిర్మాతలు ఈ విషయాలు తెలుసుకోవాలి..!

RGV : సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం నడుస్తున్న హాట్ టాపిక్ నిర్మాతల సమస్యల మీద సినిమా షూటింగుల బంద్. ఇక ఎవరికి తోచిన సొల్యూషన్ ఈ సమస్యకు వాళ్ళు చెబుతున్నారు. నిర్మాతల గిల్డ్ ముఖ్యంగా హీరోలు వాళ్ళ రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలి అంటూ డిమాండ్ చేయడం, హీరోలకోసం వచ్చే పర్సనల్ స్టాఫ్ ఖర్చులను తగ్గిస్తే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది అంటూ వివరిస్తున్నారు. ఇక ఈ విషయాలపై వివాదాలకు కేర్ ఆఫ్ అయిన ఆర్జీవి స్పందించారు. సినిమాలు ఆడటానికి కారణాలను ఆయన వివరించారు. ఒక సినిమా హిట్ అవుతుందో ప్లాప్ అవుతోంది ఎవరికీ తెలియదు అందరూ స్పెక్యూలేషన్ లోనే సినిమా తీస్తారు. 100 మంది చిన్న నిర్మాతలు చిన్న సినిమాలు తీస్తే ఎవరో ఒకరిద్దరు మాత్రమే సక్సెస్ చూస్తారు. డీజే టిల్లు హిట్ అవుతుందని ఆ నిర్మాత అయినా ఉహించి ఉంటాడా అది ఎవరూ చెప్పలేము అంటూ చెప్పాడు రామ్ గోపాల్ వర్మ.

జయప్రద పైట ఎగిరిపోయే సన్నివేశం కోసం అడవిరాముడు సినిమా చూసా…

ఇక సినిమాలో ఎవరికి ఏం నచుతుందో ఎవరు చెప్పగలరు. ఒక సినిమా పుట్టుక కథ తో మొదలవుతుంది కానీ హిట్ అవ్వడానికి కథ అవసరం లేదు, నా ఇన్నేళ్ల సినిమా ప్రయాణంలో నేను తెలుసుకున్న విషయం ఇదే. గీతాంజలి సినిమా విషయంలో ఇదే జరిగింది. సినిమా ప్రివ్యూ చూసాక గుంటూరు డిస్ట్రిబ్యూటర్ డబ్బు ఇవ్వనన్నాడు. క్యాన్సర్ పేషెంట్ డిప్రెషన్ లో ఊటీ వెళ్తాడు అక్కడ క్యాన్సర్ పేషెంట్ అయిన హీరోయిన్ ను కలుస్తాడు, ఇది ఏమైనా కథ బాగుందా నాకు నచ్చలేదు, క్యాన్సర్ అనే సీన్, యాక్సిడెంట్ సీన్, ఒప్పించి ఊటీ వెళ్లిపోయే సీన్ సినిమాలో కట్ చేసి ఇస్తేనే సినిమా కొంటాను అని చెప్పాడట. దీంతో మణిరత్నం కి తెలియకుండా కట్ చేసి గుంటూరు డిస్ట్రిబ్యూషన్ కి ఇచ్చారు. అయితే సినిమా అన్ని చోట్ల హిట్, ఇక గుంటూరు లో కూడా బాగా హిట్ అయింది. సినిమాకు మూలమైన కథలో సీన్ లు తీసేస్తే సినిమా హిట్ ఎలా అయింది అని అనుమానంతో గుంటూరు లో నా స్నేహితుడికి ఫోన్ చేసి స్టోరీ అర్థమైందా అని అడుగగా బాగుంది సినిమా అన్నాడు. అసలు ఊటీ ఎందుకు వెళ్ళాడో హీరో అర్థమైందా అంటే ఊరికే వెళ్ళాడు అని చెప్పాడు. అప్పుడు అర్థమైంది సినిమాలో కథ ఉండక్కర్లేదు పాటలు బాగున్నా సినిమా హిట్ అవుతుంది అని.

నిజానికి అడవిరాముడు సినిమా నేను 17 సార్లు చూసాను ఒకసారి సత్యానంద్ గారు మనది అనుకున్న సంపద దొంగలించ బడుతోంది అన్న సెంటిమెంట్ కి జనాలు కనెక్ట్ అయ్యారు కాబట్టే అడవిరాముడు హిట్ అయింది అని వేరేవాళ్లతో చర్చించారు. నేను 17 సార్లు చూసాను నాకెక్కడా అలాంటి కథ కనిపించలేదని బాగా ఆలోచిస్తే ఎన్టీఆర్ పోలీస్ గా అడవి కి రాకుండా మారు వేషంలో స్మగ్లింగ్ గురించి తెలుసుకుంటాడు అనే విషయం అప్పుడు గుర్తొచ్చింది. నేనే కాదు చాలా మంది ఆ సినిమాను జయప్రద పైట ఎగిరిపోయే పాటకోసం, ఎన్టీఆర్ డైలాగుల కోసం, యాక్షన్ సన్నివేశాలు, ఏనుగులు, చిరుతలతో సన్నివేశాల కోసం సినిమా చూసారు. మూల కథ ఎవరికీ తెలియదు, ఎవరూ పట్టించుకోరు అంటూ విశ్లేశించాడు.