Movie News

RGV : నేను ఎన్టీఆర్ ను ఆ సినిమా వరకు హీరోగా చూడలేదు…!

RGV : ఆర్జీవి ఏ టాపిక్ మాట్లాడినా బోల్డ్ గా తన ఒపీనియన్ చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాడు. ఇక తన సినిమాలతో కూడా వివాదాలను సృష్టిస్తుంటాడు. ఇక తాజాగా ఆర్జీవి పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటు అనేక విషయాల గురించి స్పందిస్తున్నారు. ఇక మీడియాకు కూడా ఆర్జీవితో ఇంటర్వ్యూ అంటే మహా సరదా. తాజాగా ఆర్జీవి డైరెక్టర్ చేసిన సినిమా కొండా విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఎన్టీఆర్ ను అంతవరకు హీరోగా చూడలేదు…

తనకు సినిమాలపై ఉన్న దృక్పథం గురించి మాట్లాడుతూ ఆర్జీవి ఆసక్తికర వాఖ్యలు చేసారు. తన చిన్నతనంనుండి సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూసినా కూడా ఎక్కడా తనకు ఎన్టీఆర్ హీరోలాగా కనిపించలేదట. మొదటిసారిగా అడవి రాముడు సినిమాలో ఎన్టీఆర్ హీరోలా కనిపించాడని, అంతకుముందు ఎన్నో సినిమాలు, రక్త సంబంధం లాంటి సినిమాల్లో హీరోలా కనిపించలేదంటూ మాట్లాడారు.

ఇక బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ కూడా అలానే చాలా సినిమాల తరువాత హీరోగా అనిపించాడని, డెబ్భైలలో అమితాబ్ నటించిన సినిమాలతో ఆయనను హీరోగా చూడటం మొదలు పెట్టానని చెప్పారు. ఇక కొండా సినిమా హీరో అదిత్ తో ఇంటర్వ్యూ లో మాట్లాడిన ఆర్జీవి, ఇక హిందీలో నానా పటేకర్ నటన గురించి మాట్లాడారు. నానా పటేకర్ అబ్ థక్ చప్పన్ సినిమాలో ఆయన నటన అదిత్ కు చాలా ఇష్టమట, ఇక ఆ సినిమాకు నిర్మాత ఆర్జీవి కావడం విశేషం.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago