RGV :సినిమా ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ పరిచయం అక్కర్లేని పేరు. సినిమా హిస్టరీ తీస్తే వర్మ సినిమాలకు సెపరేట్ పేజీ ఉండాల్సిందే. ఇండియన్ సినిమాకు కొత్త ట్రెండ్ ను పరిచయం చేసిన అద్భుత టెక్నిషియన్ వర్మ. శివ, రంగీలా, గాయం, గోవిందా గోవింద, సత్య ఇలా దేనికవి భిన్నంగా చిత్రాలను తీసి అన్నింటా తన మార్క్ ఆలోచనలను జనం ముందు ఆవిష్కరించి శభాష్ అనిపించుకున్నాడు. తాను డైరెక్ట్ చేసిన సినిమా విశేషాలను అందిస్తూ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఇటీవల రంగీలా సినిమా విశేషాలను పంచుకున్నారు వర్మ.
నాదగ్గర పనిచేసిన వాళ్లే ఇప్పుడు ఇండియాలో టాప్ కెమెరామెన్స్…
వర్మ సినిమాలో టెక్నీషియన్స్ ను చాలా విభిన్నంగా ఎంచుకోవడం ఆయన నైజం. ‘అనగనగా ఒకరోజు’ సినిమా కోసం స్టిల్ ఫోటో గ్రాఫర్ అయిన రసూల్ ఎల్లోర్ ను కెమెరా మెన్ గా తీసుకోవడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇక అలా సుదీప్ చటర్జీ, ఆశిన్ మిశ్రా, అమిత్ రాయ్, అముల్ రాథోడ్ వంటి వారిని తన సినిమాలకోసం కేర్ అఫ్ లేనపుడు తీసుకుని వారి కెరీర్ కి మంచి సక్సెస్ అందించాను. అప్పట్లో వాళ్ళ రెమ్యూనరేషన్ 20 నుండి 30 వేలు, ఇప్పుడు ఒక్కో సినిమాకు రెండు నుండి మూడు కోట్లు తీసుకుంటున్నారు.
వాళ్లలో టాలెంట్ లేదని నేను చెప్పను కానీ ఆ టాలెంట్ ను గుర్తించడం కూడా ఒక కళ అంటూ చెప్తాను అంటూ వర్మ తెలిపారు. ఇక రంగీలా సినిమా షూటింగ్ దాదాపు 70 % అయిపోయాక అమీర్ ఖాన్ కు డౌట్ వచ్చింది. సినిమాలో అమీర్ ఖాన్ పాత్ర హీరోయిన్ కి చివరి దాకా ప్రేమిస్తున్నానని చెప్పకపోడానికి పెద్దగా కారణాలు కనపడటం లేదు, దీన్ని జనాలు అంగీకరిస్తారా అని అడిగాడు. నీకు కథ తెలుసు కాబట్టి నీకు అనుమానం వచ్చింది వాళ్లకు కథ తెలియదు కాబట్టి ఏం జరుగుతుంది అనే ధోరణిలో చూస్తారు కాబట్టి అలాంటి అనుమానం రాదు అంటూ వర్మ అనుమానం క్లియర్ చేశారట.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…