Featured

RGV-Perni Nani: పేర్ని నానితో ఆర్జీవీ భేటీ.. మీడియాతో ఆర్జీవీ ఏం మాట్లాడారంటే..!

RGV-Perni Nani: పవన్ కళ్యాణ్ తో మొదలైన టికెట్ల వ్యవహారం ప్రస్తుతం ఇంకా సాగుతూనే ఉంది. అప్పుడే పవన్ కళ్యాన్ కు సపోర్టుగా ఉండి ఉంటే.. ప్రస్తుతం ఇక్కడి వరకు వచ్చి ఉండేది కాదు కదా అంటూ నానీ వ్యాఖ్యాలు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా థియేటర్ కంటే.. బయట కిరాణ కొట్టు నడుపుకునే వాడు ఎక్కువగా సంపాదించుకుంటున్నాడు అంటూ కామెంట్ చేయగా పెద్ద దుమారమే లేపింది.

RGV-Perni Nani: పేర్ని నానితో ఆర్జీవీ భేటీ.. మీడియాతో ఆర్జీవీ ఏం మాట్లాడారంటే..!

సినిమా టికెట్ రేట్ల ధరలు బాగా తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో చాలా మంది సినీ ప్రముఖులు, సినీ పరిశ్రమ వ్యక్తులు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కామెంట్స్ చేశారు. ఇలా పవన్ కళ్యాణ్, నానీతో మొదలైన ఈ టికెట్ల వ్యవహారం ఆర్జీవీ దాకా వచ్చేసింది అయితే అతడు ప్రభుత్వ పెద్దలతో సై అంటే సై అన్నట్టుగా ట్విట్టర్ వేదికగా యుద్దాన్నే చేశాడు.

RGV-Perni Nani: పేర్ని నానితో ఆర్జీవీ భేటీ.. మీడియాతో ఆర్జీవీ ఏం మాట్లాడారంటే..!

ట్విట్టర్లో ఏపీ సినిమాటోగ్రఫీ మినిష్టర్ పేర్ని నానిని ఉద్దేశించి వరుస ట్వీట్స్ చేశారు. ఈ ట్వీట్స్ కి పేర్ని నాని కూడా స్పందించారు. ట్విట్టర్ లో రెండు రోజులు వార్ జరిగిన తర్వాత ఆర్జీవీ కలవడానికి పేర్ని నాని అపాయింట్మెంట్ ఇచ్చారు. మూడు రోజుల క్రితమే ఇలా అపాంట్ మెంట్ వచ్చినట్లు ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ ప్రకటించాడు.


ఎంతో ఉత్కంఠ నెలకొంది..

జనవరి 10న ఉదయం ఆర్జీవీ హైదరాబాద్ నుంచి విజయవాడ విమానంలో వెళ్లి అక్కడి నుంచి కారులో అమరావతి సెక్రెటేరియట్ కి వెళ్లారు. అక్కడ నానీని కలిసిన తర్వాత ఆర్జీవీ మీడియాతో మాట్లాడారు.
తాను ఇక్కడకు పరిశ్రమ తరఫున రాలేదని.. కేవలం ఒక ఫిల్మ్ మేకర్ గా కలవడానికి మాత్రమే వచ్చానన్నారు. పెద్దల కామెంట్స్, నాగార్జున వ్యాఖ్యలపై తాను స్పందించను అంటూ చెప్పుకొచ్చాడు. టికెట్ రేట్లు తగ్గించడాన్ని వ్యతిరేకించా.. సినీ రంగంతో నాకున్న 30ఏళ్ల ఎక్స్పీఎరియన్స్ తో ఎక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని నానిగారి దృష్టికి తీసుకొచ్చా అన్నారు. ఈ వ్యవహారంపై నా అభిప్రాయం చెప్పానని.. ఫైనల్ గా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి అంటూ చెప్పుకొచ్చాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago