Rishab Shetty -Rashmika: రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఈమెను మొదటిసారిగా కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసినది కాంతార హీరో రిషబ్ శెట్టి అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.ఇలా కిరిక్ పార్టీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి రష్మిక మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.
ఇలా ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈమె అనంతరం తెలుగు తమిళ హిందీ భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకొని నేడు మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇకపోతే తనకు ఇలాంటి లైఫ్ ఇచ్చినటువంటి రిషబ్ శెట్టి తాజాగా నటించిన కాంతార సినిమా గురించి ఈమెను ప్రశ్నిస్తూ సినిమా చూశారా అని అడగగా తనకు అంత టైం లేదంటూ షాకింగ్ సమాధానం చెప్పారు.
ఇలా తనకు లైఫ్ ఇచ్చినటువంటి డైరెక్టర్ సినిమా హిట్ అయినప్పటికీ ఈమె తనకు టైం లేదని చెబుతూ సమాధానం చెప్పడంతో ఈమె పట్ల ఎంతోమంది ట్రోలింగ్ చేశారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రిషబ్ శెట్టికి తాజాగా మరో ప్రశ్న ఎదురైంది. మీరు సమంత సాయి పల్లవి రష్మిక ఈ ముగ్గురిలో ఎవరితో తదుపరి సినిమా చేయాలనుకుంటున్నారని ప్రశ్నించగా.. ఈయన సమంత సాయి పల్లవి డెడికేషన్ తనకు నచ్చుతుంది అంటూ సమాధానం చెప్పారు.
కొందరి హీరోయిన్లతో పని చేయకూడదని భావించాను…
తాను ఇకపై తన లైఫ్ లో కొంతమంది హీరోయిన్లతో పని చేయకూడదని భావించాను. కొత్తవారికి కూడా అవకాశం కల్పించాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా ఈయన రష్మిక పేరు ప్రస్తావించకుండా ఆమె సిగ్నేచర్ హాండ్స్ చూపిస్తూ రష్మికకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.ఇలా వీరిద్దరూ పలు ఇంటర్వ్యూలలో ఒకరిపై ఒకరు ఇలా కౌంటర్లు వేసుకోవడంతో వీరిద్దరి మధ్య ఏదో పెద్ద గొడవ జరిగిందని ఈ వివాదం రోజురోజుకు ముదురుతూ ఉందని తెలుస్తోంది. ఇంతకీ వీరి మధ్య ఎలాంటి గొడవ జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…