RK Roja: వైకాపా మంత్రులు ఎమ్మెల్యేలపై ప్రస్తుతం పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే .వీరు అధికారంలో ఉన్నప్పుడు కూటమి నేతల గురించి చేస్తున్న వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న కూటమి నేతలు ప్రస్తుతం వీరిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కార్యకర్తలను సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా సినీనటి మాజీ మంత్రి ఆర్కే రోజాకు సైతం గట్టి షాక్ తగిలిందని చెప్పాలి. ఈమెపై దళిత సంఘం నేతలు కర్నూలులో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. ఇక రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో గుంటూరు జిల్లాలోని బాపట్లలో సూర్యలంక బీచ్‌కు వెళ్లారు. అప్పుడు.. ఒక దళిత ఉద్యోగితో రోజా చెప్పులు మోయించారని అప్పట్లో ఈ విషయం కాస్త చర్చలకు కారణమైంది.
ఇక ఈ విషయంపై అప్పట్లో ఎన్నో దళిత సంఘాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించాయి. అయితే తాజాగా ఈ విషయంపై దళిత సంఘాలు కర్నూలులో రోజా పై పోలీస్ కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా కేసును ఫైల్ చేశారు మరి ఈ విషయంపై మంత్రి రోజా ఏవిధంగా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది..
ఇక అప్పట్లో ఈ వివాదం గురించి కూడా వివరణ ఇచ్చారు. ఇలా రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటన గురించి ఇప్పుడు కేసు నమోదు కావడంతో పలువురు వైకాపా కార్యకర్తలు విమర్శలు కురిపిస్తున్నారు. మరి ఈ విషయంపై మాజీ మంత్రి స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…