Movie News

ఆ పార్టీ వాళ్లు రోజాని ఎంతో హింసించారు..వారి వల్ల ఎన్నో ఆస్తులు కోల్పోయాము: సెల్వమని

సీనీనటిగా, ఎంఎల్ఏ గా రోజా అందరికీ సుపరిచితమే. రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనీనటిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఆ తరువాత రాజకీయాలలోకి అడుగు పెట్టింది. తాజాగా రోజా భర్త సెల్వమణి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని రోజా రాజకీయ జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

చంద్రబాబునాయుడు కోరిక మేరకు తెలుగుదేశం పార్టీ లోకి వెళ్లి మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసింది. అయితే రాజకీయాల్లో ఆమెకు తీవ్ర నిరాశ ఎదురైంది. అలా రాజకీయాల్లోకి ఎంటరైన రోజా చుట్టూ కుల రాజకీయాలు జరిగాయని ఆ పార్టీ వాళ్ళు మోసం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినా అతను ఏమి చేయకపోవడంతో ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లు తెలిపారు.

టిడిపి పార్టీలో ఉన్నప్పుడు రోజాను ఎంతో హింసించారని రాజకీయాలలో తనని ఎదగనివ్వకుండా చేశారని సెల్వమణి వెల్లడించారు. టిడిపి పార్టీలో ఉన్నప్పుడు పార్టీలో గెలవడం కోసం సుమారు నాలుగైదు ఇల్లులను కూడా అమ్మకున్నామని ఆ పార్టీ వల్ల ఎంతో ఆస్తి నష్టాన్ని కూడా భరించామని ఈ సందర్భంగా సెల్వమణి తెలియజేశారు.

ఇలా తెలుగుదేశం పార్టీలో ఎన్నో హింసలకు గురి చేసిన తర్వాత ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్ళినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కేవలం 10 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. తనని కలవడానికి వెళ్లినప్పుడు రాజశేఖరరెడ్డిగారు సాదరంగా ఆహ్వానించి మంచిగా మాట్లాడటం చూసి నాకు పదవి అవసరం లేదు కేవలం పార్టీలో ఉంటానని రోజా చెప్పినట్టు సెల్వమని చెప్పారు. అప్పటినుంచి రోజా రాజశేఖర్ రెడ్డి పార్టీలో ఉండటమే కాకుండా తన మరణానంతరం జగన్ వెంట నడిచారు అని ఈ సందర్భంగా సెల్వమణి తెలియజేశారు. ఏ పార్టీలో మీకు శత్రువులు ఎక్కువగా ఉన్నారనే ప్రశ్న ఎదురుగా ప్రతి పార్టీలోనూ శత్రువులు ఉంటారని. ఈ సందర్భంగా సెల్వమణి తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

2 minutes ago

కష్టమే విజయానికి దారి – మృణాల్ ఠాకూర్ ప్రేరణాత్మక వ్యాఖ్యలు…

సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్‌ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…

17 minutes ago

“పాక్ అణు కేంద్రంపై భారత్ దాడి?.. రక్షణ నిపుణుడి వ్యాఖ్యలతో అంతర్జాతీయ కలకలం”

భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్‌’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…

26 minutes ago

సింధ్ ఒప్పందం హక్కులతో భారత్ దూకుడు.. పాక్‌కు వెళ్లే నీటిపై చెక్..

భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…

44 minutes ago

అంబాజీ ఆలయానికి అనంత్ అంబానీ రూ.27.5 కోట్ల విరాళం.. ఐదేళ్లు భక్తులకు ఉచిత భోజనం!

భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…

54 minutes ago

ప్రభాస్ – ప్రశాంత్ వర్మ మూవీ ఫిక్స్.. భారీ బడ్జెట్‌తో రంగంలోకి హోంబలే!

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన కాంబినేషన్ ఇదే. రెబల్ స్టార్ Prabhas, ‘హనుమాన్’తో సంచలనం సృష్టించిన దర్శకుడు…

1 hour ago