Featured

Rocking Rakesh -jordar Sujatha: ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న రాకింగ్ రాకేష్ సుజాత.. వైరల్ ఫోటోలు!

Rocking Rakesh -jordar Sujatha: జబర్దస్త్ కమెడియన్లుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాత గురించి అందరికీ సుపరిచితమే.ఈ కార్యక్రమం మొదట్లో వీరిద్దరూ కలిసి ఒకే స్కిట్ లో సందడి చేసేవారు. అయితే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే వీరి ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇలా వీరి పెళ్లికి పెద్దలు అంగీకారం తెలియజేయడంతో జబర్దస్త్ వేదికగా ఈ జంట తాము ప్రేమలో ఉన్నామని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నామని షాకింగ్ న్యూస్ తెలియజేశారు.ఇలా వీరి ప్రేమ విషయాన్ని బయట పెట్టినప్పటి నుంచి తరచూ వీరిద్దరూ కలిసి పెద్ద ఎత్తున స్కిట్లు చేయడమే కాకుండా పలు వెకేషన్లకు వెళుతూ ఎంతో ఎంజాయ్ చేసేవాళ్లు.

ఈ విధంగా సుజాత రాకింగ్ రాకేష్ ఇద్దరు కూడా జబర్దస్త్ వేదికపై సందడి చేయడంతో పాటు ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తూ వారికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అయితే గత కొద్ది రోజుల క్రితం సుజాత తమ ప్రేమ ప్రయాణం గమ్యానికి చేరింది అంటూ ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా రాకేష్ తో తన పరిచయం ఆ పరిచయం ప్రేమగా మారడం, పెద్దలు ప్రేమ పెళ్లికి అంగీకరించడం వంటి అన్ని విషయాల గురించి తెలిపారు.

Rocking Rakesh -jordar Sujatha నిశ్చితార్థానికి హాజరైన మంత్రి రోజా..


ఇక వీరిద్దరూ త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నామని విషయాన్ని కూడా సుజాత తెలిపారు. అయితే వీరిద్దరి నిశ్చితార్థం జనవరి 27వ తేదీ ఎంతో ఘనంగా జరిగిందని తెలుస్తోంది. ఇలా నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిశ్చితార్థ కార్యక్రమానికి పలువురు జబర్దస్త్ కమెడియన్స్ హాజరయ్యారు అలాగే మినిస్టర్ రోజా అనసూయ యాంకర్ రవి వంటి తదితరులు కూడా ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరయ్యారు.ప్రస్తుతం వీరి నిశ్చితార్థ ఫోటోలు వైరల్ గా మారాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రోజంతా తేలికగా ఉండాలంటే ఉదయం ఈ హ్యాబిట్స్ తప్పనిసరి! గ్యాస్, బ్లోటింగ్‌ సమస్యకు ఇంట్లోనే సులభ పరిష్కారం!

ఉదయం నిద్రలేవగానే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. రాత్రి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడం, తగినంత…

19 minutes ago

కోదండరామస్వామి ఆలయంలో ఏప్రిల్ 23న ఆధ్యాత్మిక మహోత్సవం!

తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…

1 hour ago

44 డిగ్రీలకు చేరే ఉష్ణోగ్రతలు.. మూడు రోజులు హెచ్చరిక

తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…

15 hours ago

ప్రభాస్ ‘ఫౌజీ’ ఛాన్స్ వదిలేసిన టాలీవుడ్ హీరో ఎవరు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…

15 hours ago

180 బాధితులు.. దేశాన్ని షాక్‌కు గురిచేసిన ఘటన

మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…

15 hours ago

వరుణ్ తేజ్ గాయం.. నిహారిక ఎమోషనల్ ప్రెస్ నోట్

టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…

16 hours ago