Roja: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రోజా ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరీ సరసన నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఈమె తమిళ చిత్ర పరిశ్రమలో కూడా సినిమాలలో నటించి సక్సెస్ అయ్యారు. ఈమెకు తమిళం రావడంతో అక్కడ కూడా సినిమా అవకాశాలను అందుకోవడమే కాకుండా తమిళ్ డైరెక్టర్ సెల్వమణితో ప్రేమలో పడ్డారు.
ఇలా డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా రోజా సినిమాలలో నటించారు. ఇక పిల్లలు పుట్టిన తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈమె తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తల్లి పాత్రలలో నటించారు. ఇకపోతే సినిమాలలో మాత్రమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఇలా బుల్లితెర కార్యక్రమాలు చేస్తూనే రాజకీయాలలోకి అడుగుపెట్టిన రోజా మంత్రి అయిన తర్వాత జబర్దస్త్ కార్యక్రమానికి కూడా దూరమయ్యారు. ఇలా రాజకీయాలలోనూ సినిమాలలో భారీగా సంపాదించిన ఈమె ఒకానొక సమయంలో పూర్తిగా అప్పులలో కూరుకుపోయారని తెలుస్తుంది. అయితే తన భర్త చెప్పిన మాట వినడం వల్లే ఇలా నష్టపోయారని తెలుస్తుంది.
తన భర్త దర్శకుడు అలాగే నిర్మాత కావడంతో ఆయన చెప్పిన మాటలు విని సుమన్ హీరోగా సమరం అనే టైటిల్ తో ఒక సినిమాని రోజా నిర్మించారు. అయితే ఈ సినిమా పాటలు కూడా ఎంతో మంచి ఆదరణ రావడంతో సినిమా మంచి సక్సెస్ అవుతుందని బడ్జెట్ విషయంలో ఎక్కడా వెనుకడుగు వేయలేదు.
నిర్మాతగా మారి నష్టాలు..
ఇక ఈ సినిమా విడుదలైన రోజు నుంచి నెగిటివ్ టాక్ రావడంతో కోట్లలో నష్టాలు వచ్చాయి. ఇలా అప్పటివరకు సంపాదించినదంతా ఈ సినిమా కోసం ఖర్చు చేసి రోజా దంపతులు భారీగా అప్పులలో మునిగిపోయారు. అయితే ఈ అప్పుల నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని తెలుస్తుంది. ఇక ఈమె మంత్రిగా అయిన తర్వాత తన ఆస్తులు రెట్టింపు అయ్యాయి. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఓటమిపాలు కావడంతో రోజా ప్రస్తుతం ఇంటిపట్టునే ఉన్నారు. మరి తిరిగి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…