Categories: Featured

రొమాంటిక్ రహస్యాలు : అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడతారు.?

సమాజంలో ఎన్ని మార్పులొచ్చినా.. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా ఈ Confuse మాత్రం నాటి నుండి నేటి వరకూ టీనేజ్ అబ్బాయిలో బలంగా వుందంటే నమ్మశక్యంగా లేదు కదూ.. మరి ఈ Confuse కి ఓ క్లారిటీ కావాలంటే తప్పక చదవండి..

అమ్మాయి ఎలా ఉంటే తనకు నచ్చుతుందనే విషయంలో ప్రతి అబ్బాయికి ఒక క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే.. అబ్బాయిల సైకాలజీ దాదాపుగా ఒకేవిధంగా ఉంటుంది. ఏవో చిన్నచిన్న మార్పులు తప్పించి అమ్మాయిల విషయంలో అబ్బాయిల దృక్పదం దాదాపుగా ఒకటే. అందంగా ఉండాలి, అందరితో కలిసిపోవాలి. తనతోనే ఎక్కువగా మాట్లాడాలి. తననే ప్రేమించాలి.. ఇలా మగవాళ్ళ భావాలు ఉంటాయి.

అయితే, అబ్బాయిల విషయంలో అమ్మాయిల భావాలు ఎలా ఉంటాయి వారికి అబ్బాయిలు ఎలా ఉంటే నచ్చుతారు. ఎలా ప్రవర్తిస్తే నచ్చరు. ఎందుకు నచ్చరు.? అనే విషయాలలో చాలా తేడాలుంటాయి. ఒకబ్బాయిని అమ్మాయి ఇష్టపడుతుందో లేదో తెలుసుకోవడం చాలా కష్టం. కష్టమైనప్పటికీ.. వారి సైకాలజీని నిశితంగా గమనిస్తే ఎలాంటి వారిని అమ్మాయిలు ఇష్టపడతారో తెలుసుకోవచ్చు.

ముఖంపై చిరునవ్వులు చిందిస్తూ.. చిరునవ్వుకు చిరునామాగా నిలిచే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారు. అలాంటి వారితో పరిచయం చేసుకునేందుకు ఆసక్తి చూపుతారు. మూతి ముడుచుకొని దూరంగా ఉండేవారికి అమ్మాయిలు చాలా దూరం. ఇక చాలామంది అబ్బాయిలు అమ్మాయిలను ఇప్రెస్ చేయాలనే ఉద్దేశ్యంతో జిమ్ కి వెళ్లి సిక్స్ ప్యాక్, 8 ప్యాక్ అంటూ శరీరాన్ని పెంచుతుంటారు. ఇలా శరీరం పెంచుకునేవారంటే వారికి అస్సలు ఇష్టముండదు. చూడటానికి కాస్త బాగుండి, మంచి ఆరోగ్యవంతంగా ఉంటే సరిపోతుందట. వారికే ఎక్కువ దగ్గరవుతుంటారు.

ముఖ్యంగా అబ్బాయిలు ఎలాంటి వారో వారి కళ్ళను చూసి చెప్పేస్తారు. వారి చూపుల్ని బట్టి, చూసే విధానం బట్టి.. అబ్బాయిలు ఎలాంటి వారో పసిగట్టేస్తారట. అబ్బాయిలలో అమ్మాయిలకు నచ్చే మరో అంశం సెన్స్ ఆఫ్ హ్యుమర్. సెన్స్ ఆఫ్ హ్యుమర్ కలిగిన వ్యక్తులంటే వారికీ చాలా ఇష్టం. తనను నవ్విస్తూ తనతో ఉన్న వారిని కూడా నవ్వించాలని కోరుకుంటారు. ఆ సెన్సార్ హ్యుమర్ అనేది శృతిమించకూడదట. అతిగా మాట్లాడేవాళ్ళని వీరు నమ్మరు. అబ్బాయిలు మాట్లాడే ప్రతిమాటను అమ్మాయిలు నిశితంగా గమనిస్తారట. వారి భావవ్యక్తీకరణ ఎలా ఉన్నది.. వారి తీరు ఎలా ఉన్నది.? అని గమనించిన తరువాతే వారితో కలిసేందుకు, వారితో మాట కలిపేందుకు ఇష్టపడతారు. So.. అమ్మాయిలకు దగ్గరవ్వాలంటే ముందు వారి సైకాలజీ ఏమిటి అన్నది అర్ధం చేసుకోవాలి. ఇదే అంశంలోకి ఇంకాస్త లోతుగా వెళ్తే..

తోటి స్నేహితురాలు ప్రేమలో పడిందని తెలిస్తే జతగత్తెలు తెగ సరదా పడతారు. అతడెలా ఉంటాడో తెలుసుకోవాలని ఉత్సుకత ప్రదర్శిస్తారు. ‘ఎవరే? అతడెవరే? నీ జతగాడెవరే? అందంగా ఉంటాడా? హీరోలా ఉంటాడా? బాగా మాట్లాడతాడా? ఆరడుగుల అందగాడేనా? ధైర్యస్థుడేనా?’ లాంటి ఎన్నో ప్రశ్నలతో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తారు. నిజమే!! నిజానికి అబ్బాయిల్లో ఏం చూసి అమ్మాయిలు ప్రేమిస్తారు? వాళ్ళు కోరుకునే ఫీచర్స్‌ ఏమిటి? వాళ్ళకు కావాల్సిందేమిటి?

ఒక అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలంటే సింపుల్‌గా చెబుతారు, ‘అందంగా ఉండాలి చదువుకుని ఉండాలి అణకువగా ఉండాలి’ అని. కానీ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలి అని చెప్పాలంటే మాత్రం ఇలానే ఉండాలి అనే ఒక ప్రత్యేకమైన ఫార్మాట్‌ చెప్పడం కష్టం! ప్రతి అమ్మాయికి ఎంచుకోబోయే అబ్బాయి పట్ల విభిన్నమైన అభిరుచులు ఉంటాయి. కానీ మగవాళ్ళకి మాత్రం పక్కాగా కొన్ని క్వాలిటీస్‌ కలిస్తే చాలు. ఒకరు ఇష్టపడేదాన్ని మరొకరు ఇష్టపడకపోవచ్చు. ఒక వ్యక్తి ఒకరికి నచ్చితే మరొకరికి నచ్చకపోవచ్చు. ఈ నేపథ్యంలో అమ్మాయిలు తమ భాగస్వామి నుంచి ఎలాంటి లక్షణాలను ఆశిస్తారు.?

అబ్బాయిలెప్పుడూ మహిళల శారీరక ఆకర్షణ విషయంలోనే ఎక్కువగా అట్రాక్ట్‌ అవుతారు. తెల్లగా, అందంగా, బొద్దుగా ఉండాలి… ఇలా రకరకాలుగా అనుకుంటుంటారు. అయితే అమ్మాయిలెప్పడూ అబ్బాయిల శారీరక ఆకర్షణను అంతగా పట్టించుకోరు. అమ్మాయిలెప్పడూ అబ్బాయిల్లో ఒక్క అందం మాత్రమే కాదు మరికొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకునేందుకు కూడా శ్రద్ధ తీసుకుంటారు. ఒకవేళ ఆ అంశాలన్నీ ఓకే అయితే అబ్బాయి యావరేజ్‌గా ఉన్నా సరే పెళ్ళి చేసుకుంటారు. అందుకే చాలామంది అమ్మాయిలు యావరేజ్‌ అబ్బాయిలను పెళ్ళి చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

అబ్బాయిలు శారీరక ఆకర్షణకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అందుకే చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల ఫొటోలు చూడడానికే ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే ఆడవాళ్ళు శారీరక ఆకర్షణ కంటే అబ్బాయిల వ్యక్తిత్వానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. అంటే వాళ్ళకు అందంతో పనిలేదా? అందంగా ఉన్నవారిని ఇష్టపడరా? అనే డౌట్‌ మీకు రావచ్చు.? కానీ నిజానికి అదేం కాదు.. అబ్బాయి అందంగా ఉండడమే కాదు పర్సనాలిటీ, క్యారెక్టర్‌ కూడా బాగుంటే వాళ్ళను కచ్చితంగా ఇష్టపడతారు. స్మార్ట్‌గా, ఇంటెలిజెంట్‌ గా ఉండే అబ్బాయిల పట్ల అమ్మాయిలు ఎక్కువగా ఎట్రాక్ట్‌ అవుతారు. ఏ అబ్బాయి అయితే స్మార్ట్‌గా ఆలోచిస్తాడో మానసికంగా స్ర్టాంగ్‌గా ఉంటాడో, నమ్మదగిన వ్యక్తిత్వం కలిగి ఉంటాడో అలాంటి అబ్బాయి చూపులకు యావరేజ్‌గా ఉన్నా గానీ అతడికి అందమైన భార్య వస్తుంది.

ఈ మధ్యకాలంలో బట్టతల కూడా ఒక క్వాలిఫి కేషన్‌గా మారింది. పెళ్ళి విషయానికి వచ్చేసరికి బట్టతల ఉన్న అబ్బాయిలను చాలామంది అమ్మాయిలు రిజెక్ట్‌ చేస్తారు అనుకుంటున్నారు కదూ.. కానీ ఇకనుంచి ఆ భావన వదిలేయండి. ఇప్పుడు ట్రెండ్‌ మారింది, ఒత్తైన రింగురింగుల జుత్తు ఉన్నవాళ్ళనేకాదు చాలామంది అమ్మాయిలు బట్టతల ఉండే అబ్బాయిలను కూడా ఇష్టపడుతున్నారు. బట్టతలఉన్న అబ్బాయిలే ఎక్కువ అందంగా ఉంటారని భావిస్తున్నారు. బట్టతలలో చాలా రకాలు ఉంటాయి కదా! కొంత మందికి కేవలం పైభాగంలో మాత్రమే జుట్టు ఉండి చుట్టూ హెయిర్‌ లేకుండా ఉంటుంది. ఇంకొంతమంది అబ్బాయిలకు అక్కడక్కడ జుట్టు ఊడిపోయి కనిపిస్తూ ఉంటుంది. ఇదే అంశంపై ఈమధ్యనే జరిగిన ఓ పరిశోధనలో అధ్యయన వేత్తలు ఎంచుకున్న వెయ్యిమంది మహిళలకు 3 కేటగిరీలలో అబ్బాయిలను చూపించారు. అందులో జుట్టు ఉన్న అబ్బాయిలు, కొద్దిగా బట్టతల ఉన్న అబ్బాయిలు, పూర్తిగా తలకు జుట్టు లేకుండా షేవ్‌ చేసుకున్న అబ్బాయిలను చూపించారు. చాలా మంది అమ్మాయిలు క్లీన్‌గా జుట్టు లేకుండా షేవ్‌ చేసుకున్న అబ్బాయిలనే ఇష్టపడ్డారట. బట్టతల ఉన్న అబ్బాయిలు స్ర్టాంగ్‌గా మ్యాన్లీగా, పవర్‌ఫుల్‌గా, పొడవుగా ఉంటారని చెప్పారట. జనంలో ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళు పూర్తిగా షేవ్‌ చేసుకున్న అబ్బాయిలనే ఎట్రాక్ట్‌ చేస్తాయని మహిళలు అన్నారట. చాలామంది మహిళలు బట్టతల కొద్దిగా ఉంటే తమకు ఇష్టం ఉండదని చెప్పారట. ఫుల్‌ హెయిర్‌ ఉన్న అబ్బాయిలు లేదా పూర్తిగా జుత్తు లేకుండా గుండు చేసుకున్నట్టుండే అబ్బాయిలంటేనే ఇష్టమని చెప్పారట. ఇక పొడవుగా పెంచిన గడ్డం, పూర్తిగా జుత్తులేని బట్టతల కాంబినేషన్ చాలా ఎట్రాక్టివ్‌గా ఉంటుందని మహిళలు చెబుతున్నారు. ఇలా ఉండే అబ్బాయిలకు అమ్మాయి తెగ అట్రాక్ట్‌ అయిపోతారట. So.. బట్టతల భయం వదిలేయచ్చని సర్వే అధికారులు అబ్బాయిలతో చెప్పేస్తున్నారు.

ఇక అలవాట్లు.. అభిరుచుల విషయానికొస్తే..☺️
అలవాట్లు, అభిరుచులు అనేవి ఇద్దరికీ ఒకేలా ఉండాలన్న నిబంధన ఏమీలేదు. ఐతే కొందరు అబ్బాయిలు ఏం చెప్పినా అందులో లోపాలు ఎత్తి చూపడం. దెప్పిపొడవడం, నాదే కరెక్ట్‌ అనడం వంటివి చేస్తుంటారు. ఇలా ప్రతి విషయంలోనూ ఎదుటివారిని తక్కువ చేసి చూడడమే కాకుండా నిరుత్సాహానికి గురిచేస్తారు. ఇలాంటి ప్రవర్తనగల అబ్బాయిలను అమ్మాయిలు అస్సలు ఇష్టపడరు. తనని, తన అభిరుచుల్ని గౌరవించే వ్యక్తి ఎలాఉన్నా సరే ఓకే చెప్పేస్తారు.

అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలను ఇష్టపడతారనే విషయంపై ఇంకా డీప్ గా చెప్పాల్సివస్తే..☺️
కొందరమ్మాయిలు మంచి శరీర పుష్టికలిగిన అబ్బాయిలను ఇష్టపడుతున్నారు. కలర్‌ గురించి ప్రశ్నిస్తే అస్సలు కలర్‌ పట్టించుకోరనేదే దాదాపు చాలామంది అమ్మాయిలు చెప్పే సమాధానమే..! ఇక సెన్సాఫ్‌ హ్యూమర్‌ కలిగిన అబ్బాయిలను బాగా లైక్‌ చేస్తారు. ఎప్పుడూ సరదాగా స్పోర్టివ్‌ గా ఉండేవాళ్ళని ఇష్టపడతారు. టీనేజ్‌ అమ్మాయిలైతే బాగా కవ్వించే అబ్బాయిలను ఇష్టపడుతున్నారు. అందం,తెలివితో పనిలేకపోయినా స్టైల్‌గా ఉండే వాళ్ళ వైపే అట్రాక్ట్‌ ఎక్కువగా అవుతారు????

శైలి (రచయిత) 77804 71892

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

స్లో ఓవర్ రేట్ దెబ్బకు పాకిస్థాన్‌కు భారీ షాక్.. ICC కఠిన చర్యలు

అంతర్జాతీయ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రేసులో ఉన్న పాకిస్థాన్ జట్టుకు ఐసీసీ నుంచి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి…

5 hours ago

నోయిడాలో పెళ్లైన 5 నెలలకే యువతి అనుమానాస్పద మృతి.. వేధింపుల ఆరోపణలు

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో 33 ఏళ్ల త్విషా శర్మ అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. కేవలం ఐదు నెలల క్రితమే…

5 hours ago

తమిళనాడులో విజయ్ లాగా.. తెలంగాణలో నేనే అధికారంలోకి వస్తా: కవిత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మరోసారి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించే వ్యాఖ్యలు…

7 hours ago

తలుపు వెనుక ఇవి పెడితే నిజంగా దురదృష్టమా? వాస్తు నిజాలు

వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు కేవలం నివాస స్థలం మాత్రమే కాదు, అది శక్తి ప్రవాహం జరిగే ప్రదేశంగా కూడా…

7 hours ago

ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో AI సేవలు.. భక్తులకు స్మార్ట్ దర్శనం వైపు అడుగు

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయం త్వరలో హైటెక్ మార్పులకు సిద్ధమవుతోంది. భక్తులకు మరింత సులభంగా, వేగంగా దర్శనం…

8 hours ago

భారీగా పెరగనున్న నిత్యావసరాల ధరలు.. సామాన్యులపై మళ్లీ భారమే

దేశంలో నిత్యావసరాల ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో కేంద్రం పెట్రోల్,…

8 hours ago