కరోనా ఎఫక్ట్ తో ప్రపంచమంతా లాక్ డౌన్ జపం చేస్తోంది. పరిశ్రమలు, వ్యాపారాలు , సినిమా షూటింగ్లు అన్ని మూతపడ్డాయి… ఈ క్రమంలో షూటింగ్లు లేక సినీ ప్రముఖులంతా ఇంటికే పరిమితమయ్యారు. అయితే ప్రసుత్తం టాలీవుడ్ లో “బి ది రియల్ మెన్” ఛాలెంజ్ విపరీతంగా ట్రెండ్ అవుతుంది. దేనికి కారణం మన సినీతారలు అందరు అందులో పాల్గొనడమే.. లాక్ డౌన్ కారణంగా ఇంట్లో పనిమనిషులు రాకపోవడంతో… ఇంట్లోని ఆడవారికి సాయంగా ఉండటమే అసలైన మగతనం అంటూ అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ మొదలుపెట్టిన ఈ ఛాలెంజ్ ఇప్పుడు టాలీవుడ్ మొత్తానికి పాకింది.
సందీప్ వంగ మొదటగా ఇంట్లోపని చేస్తూ ఒక వీడియో చేసి దర్శకధీరుడు రాజమౌళికి ఛాలెంజ్ విసిరాడు. సందీప్ వంగ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన రాజమోళి తన ఇంట్లో ఇల్లు శుభ్రం చేయడం, కడగడం వంటివి చేసి హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ను నామినేట్ చేసాడు. ఆ వెంటనే ఎన్టీఆర్ కూడా ఇంట్లో పనులు చేస్తూ వీడియో చేసి సీనియర్లు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, కొరటాల శివ లను నామినేట్ చేసాడు. ఇదే క్రమంలో రామ్ చరణ్ కూడా తను ఇంట్లో పనులు చేస్తూ, కాఫీ పెట్టి ఉపాసనకు ఇచ్చి వీడియో పోస్ట్ చేసాడు..
ఈ సందర్భంగా ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివను నామినేట్ చేయడంతో.. ఆయన కూడా వీడియో పోస్ట్ చేస్తూ.. రౌడీ విజయ్ దేవరకొండను నామినేట్ చేసాడు. దీనిపై స్పందించిన విజయ్ దేవరకొండ “శివ సార్… మా మమ్మి నన్ను పని చేయనివ్వట్లేదు. నేను చేస్తే పని డబుల్ అవుతుంది అని అంటుంది.. మమ్మల్ని ఇంట్లో రియల్ మెన్ లా చూడటంలేదు.. ఇంకా పిల్లలనే ట్రీట్ చేస్తున్నారు. అయినా సరే లాక్ డౌన్ సమయంలో నా రోజు ఎలా గడుస్తుందో తెలిపేలా ఒక చిన్న వీడియో చేసి పెడతాను” అంటూ ట్వీట్ చేసాడు విజయ్. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ఫైటర్ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా ఆగిపిన విషయం తెలిసిందే.. తర్వాత కొరటాల, విజయ్ కాంబినేషన్లో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం..
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…