దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు ప్రధాన పాత్రల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్. ఆర్. ఆర్. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో తెలంగాణ పోరాట వీరుడు కొమరంభీం, బ్రిటీషు వారిని గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజులకు సంబందించిన కల్పితగాథ. ఇద్దరు టాలీవుడ్ టాప్ స్టార్స్ చేసున్న ఈ ముల్టీస్టారర్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆలియాభట్, అజయ్ దేవగన్ సహా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
ఈ సినిమాకు కూడా లీకేజ్ బాధలు తప్పడం లేదు. ఇటీవలే సినిమాకి సంబంధించి లొకేషన్స్, ఎన్టీఆర్ లుక్ లీక్ అవడం జరిగింది. దీనితో ఆర్ ఆర్ ఆర్ టీమ్ లొకేషన్లో భారీ జాగ్రత్తలు తీసుకుంటుంది. అయినా కూడా ఈ లీకులను నివారించలేకపోతున్నారు. తాజాగా ఎన్టీఆర్ కు సంబందించిన ఒక ఫైట్ సీన్ లీక్ అయింది. ఈ ఫైట్ కొమరంభీం, పులి మధ్య జరిగే హోరా హోరి యాక్షన్ సీన్. సినిమాలో ఈ సీన్ చాలా కీలకమైన ఘట్టమట. అయితే ఈ విషయం తెలుసుకున్న చిత్ర యునిట్ వెంటనే అప్రమత్తమై కాపీరైట్ ఇష్యూ కింద ఈ వీడియోని ఇంటర్నెట్ నుంచి తొలగించారు. ఈ లీకులుల బేరదనుంచి రాజమౌళి అండ్ టీం తప్పించుకోడానికి ఎం మాస్టర్ ప్లాన్ వేస్తారో చూడాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…